Vishnu Priya: యాంకర్‌ విష్ణు ప్రియ ఇంట విషాదం

Vishnu Priya: బుల్లితెర నటి, యాంకర్‌ విష్ణు ప్రియ ఇంట విషాదం నెలకొంది.

Update: 2023-01-27 04:59 GMT

Vishnu Priya: యాంకర్‌ విష్ణు ప్రియ ఇంట విషాదం

Vishnu Priya: బుల్లితెర నటి, యాంకర్‌ విష్ణు ప్రియ ఇంట విషాదం నెలకొంది. ఆమె మాతృమూర్తి కన్నుమూశారు. ఈ విషయాన్ని విష్ణు ప్రియా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది. ''మై డియర్‌ లవ్లీ అమ్మా.. ఈ రోజు వరకూ నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా చివరి శ్వాస వరకూ గుర్తు చేసుకుంటూనే ఉంటా. నువ్వే నా బలం.. అలాగే బలహీనత కూడా. ఇకపై ప్రతిక్షణం నువ్వు నాతోనే ఉంటావు. ముఖ్యంగా నేను తీసుకునే ప్రతి శ్వాసలోనూ నువ్వు ఉంటావు. అలా, నేను బలాన్ని పొందుతాను. ఈ భూమ్మీద నాకంటూ ఓ మంచి జీవితం ఇవ్వడం కోసం నువ్వు చేసిన త్యాగాలన్నింటికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా'' అని కన్నీటి పర్యంతమైంది. కాగా ఈ వార్త తెలుసుకున్న బుల్లితెర నటీనటులు, యాంకర్లు విష్ణుప్రియ ఫ్యామిలీ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News