Netflix Top movie: ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువగా చూసిన సినిమా ఏంటో తెలుసా.?
Netflix Top movie: చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కురించింది. ఏకంగా రూ. 100 కోట్లను రాబట్టింది. ఇదిలా ఉంటే అనంతరం ఓటీటీ వేదికగా వచ్చిన ఈ చిత్రానికి ఓటీటీలోనూ మంచి ఆదరణ లభించింది.
Netflix Top movie: కథలో కంటెంట్ ఉండాలే కానీ.. బడ్జెట్‌తో సంబంధం లేదని ఎన్నో సినిమాలు నిరూపించాయి. భారీ బడ్జెట్‌తో, కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌తో తెరకెక్కిన సినిమాలతో సమానంగా చిన్న సినిమాలు సైతం విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ఇలాంటి ఓ సినిమానే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ ఏడాది ఎక్కువ మంది వీక్షించిన సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంతకీ ఏంటా సినిమా, కథెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'మహారాజ' థియేటర్లలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కురించింది. ఏకంగా రూ. 100 కోట్లను రాబట్టింది. ఇదిలా ఉంటే అనంతరం ఓటీటీ వేదికగా వచ్చిన ఈ చిత్రానికి ఓటీటీలోనూ మంచి ఆదరణ లభించింది. 2024 ఏడాదికి గాను నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన ఇండియన్ మూవీగా రికార్డును సొంతం చేసుకుందీ మూవీ.
థియేటర్లలో వచ్చిన దాదాపు ఆరు వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అయిన 'మహారాజ'.. ఈ ఏడాది సదరు ఓటీటీలో ఎక్కువమంది చూసిన సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు 18.6 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. దీని తర్వాతి స్థానాల్లో క్రూ (17.9 మిలియన్లు), లాపతా లేడీస్ (17.1 మిలియన్లు), సైతాన్ (14.8 మిలియన్లు), ఫైటర్ (14 మిలియన్లు), యానిమల్ (13.6 మిలియన్లు), డుంకీ (10.8 మిలియన్లు) ఉన్నాయి.