Varun Tej: మెగా ఇంట్లో పెళ్లి సందడి..పెళ్లి పీటలెక్కబోతున్న వరుణ్ తేజ్..!
Varun Tej: జూన్ 9న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం
Varun Tej: మెగాహీరో వరుణ్‌తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్ 9న హైదరాబాద్ లో జరగనుంది. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంతమంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న వీరిద్దరు జూన్ 1న హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆ తర్వాత వీరిద్దరి నిశ్చితార్థంపై మెగా ఫ్యామిలీ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.