Sharada Reacts on Rumors: ప్రముఖ సీనియర్ నటి ఊర్వశీ శారద మరణించించారని సోషల్ మీడియాలో వస్తున్న అసత్యపు వార్తలపై ఆమె ఘాటుగా స్పందించింది. సోషల్ మీడియాలో ఎవరో ఒక వెధవ చేసిన పనికి ఇపుడు అందరు ఏడుస్తున్నారని ఆ వార్తతో తనకి విపరీతమైన కాల్స్ వస్తూనే ఉన్నాయని శారద చెప్పుకొచ్చింది. ఇలా బతికి ఉండగానే చనిపోయారనే వార్తలు వ్రాసి అందరిని ఇబ్బంది పెట్టాడని, ఇలా పనిపాటలేకుండా అవాస్తపు వార్తలు రాసే బదులు ఏదైనా మంచి పని చేసుకోవాలని శారద ఆగ్రహం వ్యక్తం చేసింది.
తన మరణ వార్త విని తన స్నేహితుడితో మాట్లాడిన శారద తాను క్షేమంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. ఇక ఇలా బతికుండగానే జనాలను చంపే వార్తలు రాయడం మానుకోవాలని శారద తనపై వస్తోన్న రూమర్లను ఖండించింది. 1968లో సినిమాల్లో అడుగుపెట్టిన శారద తెలుగు, మలయాళం భాషల్లో హీరోయిన్ గానే కాకుండా పలు ప్రధాన పాత్రల్లో నటించి నటిగా మంచి గుర్తింపు పొందడమే కాకుండా ఉత్తమ నటిగా నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా పొందింది.