Tollywood: టాలీవుడ్ లో మరో విషాదం
Tolly wood: ‘పెళ్లి సందడి’ సినిమాటోగ్రాఫర్ వి.జయరాం కరోనాతో కన్నుమూత
Tollywood: కరోనా మహమ్మారికి టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. కరోనా దెబ్బకి సామాన్య ప్రజలతో పాటు ఎంతోమంది ప్రముఖులు ఈ వ్యాధి బారిన పడి కన్నుమూశారు. అందులో సినీ పరిశ్రమకు చెందినవారు కూడా చాలామంది ఉన్నారు. తాజాగా ఈ రోజు తెల్లవారు జామున సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కోవిడ్ కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలింది. చికిత్స తీసుకుంటూనే.. పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.
వరంగల్ కు చెందిన జయరామ్ ఎల్వీ ప్రసాద్ కుమారుడు ఆనంద్ బాబు ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగారు. జయరామ్ కెమెరామన్ గా తొలి చిత్రం మెగాస్టార్ చిరంజీవిది కావడం విశేషం. శ్రీ షిర్డీ సాయిబాబు మహత్యం సినిమాటో గ్రాఫర్ గా ఆయనకు మంచి పేరు తెచ్చపెట్టింది.తెలుగులో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల చిత్రాలకు అలాగే మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి బడా హీరోల సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి.. తన పనితనం చూపించారు.
జయరాం. ఇటు తెలుగు, అటు మలయాళం సినిమా రంగంలోనూ సినిమాటోగ్రాఫర్‌గా సత్తా చాటి… ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. బ్లాక్ బాస్టర్ 'పెళ్లి సందడి' చిత్రానికి కూడా ఆయనే సినిమాటోగ్రాఫర్.