Rana Daggubati: చేస్తే అలాంటి సినిమాలే చేయాలి లేదా అసలు చేయకూడదు అంటున్న రానా
Rana Daggubati: అందుకే సినిమా సినిమాకి గ్యాప్ తీసుకుంటున్నాను అంటున్న రానా
Rana Daggubati: "లీడర్" సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన రానా సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉండే వాడు. కానీ బాహుబలి సినిమా తర్వాత తన స్పీడ్ బాగా తగ్గించేశారు రానా. "బాహుబలి 2" తర్వాత కేవలం నాలుగైదు సినిమాలలో మాత్రమే నటించారు రానా. అయితే సినిమాల సెలక్షన్ విషయంలో ఇంత ఆలస్యం చేయటం మరియు సినిమా సినిమాకి ఇంత గ్యాప్ తీసుకోవటం వెనుక రానాకి ఒక పెద్ద కారణమే ఉందట.
తాజాగా "రానా నాయుడు" వెబ్ సిరీస్ ప్రమోషన్ తో బిజీగా ఉన్న రానా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అందులో భాగంగా మాట్లాడుతూ సినిమా సినిమాకి మధ్య ఎందుకు అంత గ్యాప్ తీసుకుంటున్నారు అనే విషయంపై కూడా రియాక్ట్ అయ్యారు. "కరియర్ మొదట్లో సంవత్సరానికి కనీసం మూడు సినిమాలైనా చేయకపోతే జనాలు మనల్ని మర్చిపోతారేమో అని సినిమాలు చేయాల్సిన అవసరం ఉండేది.
కానీ ఇప్పుడు నేను ఎవరినో ఇండియా మొత్తం తెలుసు. కాబట్టి చేసేది ఏదైనా అద్భుతమైన సినిమా చేయాలి లేదంటే అసలు చేయకూడదు," అని అన్నారు రానా. అందుకే బాహుబలి తర్వాత పెద్దగా సినిమాలలో కనిపించటం లేదని స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లు తెలియజేశారు. ఇక మంచి అంచనాల మధ్య "రానా నాయుడు" నెట్ ఫిక్స్ లో మార్చి 10వ తేదీ నుంచి స్ట్రీమ్ కాబోతోంది. తెలుగు మరియు హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ విడుదల కాబోతోంది. మరి ఈ వెబ్ సిరీస్ తో రానా ఎంతవరకు మెప్పిస్తారో వేచి చూడాలి.