ఆస్కార్ వారు ఇచ్చిన అవకాశాన్ని రామ్ చరణ్, ఎన్టీఆర్ వద్దనుకున్నారా..?
ఆస్కార్ వారు ఇచ్చిన అవకాశాన్ని రామ్ చరణ్, ఎన్టీఆర్ వద్దనుకున్నారా..?
Naatu Naatu: "ఆర్ఆర్ఆర్" సినిమా నుంచి "నాటు నాటు" పాట ఈ మధ్యనే ఆస్కార్ కూడా అందుకొని తెలుగు చిత్రసీమ పేరుని ప్రపంచమంతా మారు మ్రోగేలా చేసింది. అయితే ఆస్కార్ వేడుక సమయంలో సినిమాలో పాటని పాడిన రాహుల్ సిప్లిగంజ్ మరియు కాలభైరవ లు స్టేజ్ మీద కూడా లైవ్ లో పెర్ఫార్మ్ చేశారు. అదే స్టేజిపై ఆ పాటకి ఈ సినిమాలో స్టెప్పులు వేసిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కలిసి డాన్స్ చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ అలా జరగలేదు. వేరే డాన్సర్లు ఈ పాటకి పర్ఫార్మ్ చేశారు.
అయితే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లైవ్ లో ఎందుకు డాన్స్ చేయలేదు అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఎన్టీఆర్ దీనిపై రియాక్ట్ అయ్యారు. స్టేజి మీద డాన్స్ చేసే అవకాశం వచ్చింది కానీ ప్రాక్టీస్ చేయడానికి సమయం మాత్రం దొరకలేదని అందుకే లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వలేదని ఎన్టీఆర్ ఒక సందర్భంలో చెప్పారు. మరోవైపు రామ్ చరణ్ ఇంకొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమకు అసలు ఆహ్వానమే లభించలేదు అని చెప్పి అభిమానులను కన్ఫ్యూషన్ లో పడేసాడు. అయితే ఇద్దరు హీరోలకి అవకాశం అయితే వచ్చిందని కానీ వారిద్దరూ ఒప్పుకోలేదని ఆస్కార్ కమిటీ సభ్యులు నుంచి ఒక కీలక సభ్యుడు వెల్లడించారు.
ఫిబ్రవరి ఆఖరిలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లకు ఈ పిలుపు వచ్చింది. మామూలుగా అయితే 15 రోజులు ప్రిపరేషన్ కి సరిపోతాయి. కానీ ఈ పాటలో చాలా కష్టమైన స్టెప్పులు ఉన్నాయి. షూటింగ్ సమయంలోనే ఈ పాటను చిత్రీకరించడానికి చిత్ర బృందానికి 17 రోజులు పట్టింది. అలాంటిది లైవ్ లో పెర్ఫార్మ్ చేయాలి అంటే చాలా రోజుల ప్రాక్టీస్ అవసరం. లేదా పెర్ఫార్మెన్స్ మొత్తం నవ్వులాటలా మారుతుంది. అందుకే ఈ ఇద్దరు హీరోలు లైవ్ పెర్ఫార్మెన్స్ ఒప్పుకోలేదని తెలుస్తోంది.