ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ బయోపిక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది అంటూ పెదవి విరిచారు తమ్మారెడ్డి. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు కాని సెకండ్ హాఫ్ అంతా ఎన్టీఆర్ గారు చేసిన సీన్స్ ను రీ షూట్ చేసినట్లు మాత్రమే ఉందని అన్నారు. ఇక 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ చూసి, బయోపిక్ ల పేరుతో ఎన్టీఆర్ గారిని రోడ్డుకు ఈడ్చారు అని వాపోయారు. రాజకీయ జీవితాన్ని ఇలా రోడ్ మీదకి లాగడం వల్ల ఆయన్ను అభిమానించే వారికి బాధ కలుగుతుంది అని అన్నారు.
ఇక 'యాత్ర' సినిమా గురించి మాట్లాడుతూ, "ఇది బయోపిక్ కాదు వైఎస్ ఆర్ గారి జీవితంలో ఒక ఘట్టం మాత్రమే. కానీ ఆ అంశాన్ని బేస్ చేసుకుని సినిమా చాలా బాగా తీశారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు కళ్లకు నీళ్లు తెప్పించాయి. జరిగిన సంఘటనలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం సులువైన విషయం కాదు. కానీ యాత్రలోని సీన్స్ బాగా చిత్రీకరించారు. కానీ చివర్లో రాజశేఖర్ రెడ్డి గారి మరణంకు సంబంధించిన సీన్స్ చూపించడం మైలేజ్ కోసం చేసిన పనిలా అనిపించిందని అన్నారు.