Sukumar: స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఆడుతున్న డబల్ గేమ్..!
* డైరెక్టర్ గా కంటే రైటర్ గా ఎక్కువ సినిమాలు తీస్తున్న సుకుమార్
Sukumar: గత కొంతకాలంగా హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు తీస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరు. ఈ మధ్యనే పుష్ప: ది రూల్ సినిమాతో సుకుమార్ ఇప్పుడు ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు. అయితే బాహుబలి వంటి ప్యాన్ ఇండియా సినిమా తీయడానికి డైరెక్టర్ రాజమౌళి ఐదేళ్ల సమయం తీసుకున్నారు. ఆ సినిమా రెండు భాగాలుగా విడుదలైంది. ఇప్పుడు సుకుమార్ పుష్ప కూడా రెండు భాగాలు గానే విడుదలవుతుంది.
ఒక భారీ ప్రాజెక్టును ఎంపిక చేసుకుని ఏళ్ల తరబడి దానిపై వర్క్ చేసి విడుదల చేయటం ఇద్దరి డైరెక్టర్ల స్పెషాలిటీ. ఒకవైపు డైరెక్టర్ గా బిజీగా ఉంటూనే మరోవైపు కథలను రాస్తూ అవి వేరే డైరెక్టర్లకు ఇచ్చి కొత్తవారిని డైరెక్టర్లుగా మార్చడంలో సుకుమార్ ఎప్పుడూ ముందే ఉంటారు. ఒకవైపు "పుష్ప" సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ సుకుమార్ తన సుకుమార్ రైటింగ్స్ టీమ్ లో కలిసి కథలు, స్క్రిప్టులు రాసి దానిని ఇతర డైరెక్టర్లకు ఇస్తూ ఉంటారు.
యువ రచయితలకు మరియు డైరెక్టర్లకు సహాయం చేయడానికి సుకుమార్ ఏమాత్రం వెనకాడరు. అలా సుకుమార్ శిష్యుల్లో నుంచి ఇప్పుడు డైరెక్టర్లుగా స్థిరపడిన వారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఇప్పుడు సాయి ధరంతేజ్ "విరూపాక్ష" సినిమాకి కూడా సుకుమార్ స్క్రిప్ట్ అందించారు. డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ సినిమాకి కూడా సుకుమార్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. డైరెక్టర్ గా మాత్రమే కాక రైటర్ గా మరియు నిర్మాతగా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.