Ravi Teja: పులిని వేటాడే పులి.. టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ అదుర్స్.. ఇది 100 కోట్ల బొమ్మ..!
Ravi Teja: రవితేజా హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు.
Ravi Teja: రాబిన్ హుడ్ గురించి మనందరికీ తెలుసు..డబ్బున వాళ్లని దోచుకొని పేదవాళ్లకు పంచుతాడు. ఈ ఆంగ్ల జానపద క్యారెక్టర్ ను బేస్ చేసుకొని..హాలీవుడ్ లోనే కాదు అన్ని ఇండస్ట్రీలో పలు సినిమాలు వచ్చాయి. అలాంటి రాబిన్ హుడ్ మన తెలుగువారికి కూడా ఉన్నాడు. అతడే గోకరి నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల సమీపంలో ఉండే స్టువర్టుపురానికి చెందిన గోకరి నాగేశ్వరరావు ఒక గజ దొంగ..ఇతడిని మన ఆంధ్రా రాబిన్ హుడ్ గా టైగర్ నాగేశ్వరరావుగా చెబుతుంటారు. కట్ చేస్తే ఈ గజ దొంగ జీవితం ఆధారంగా టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజా హీరోగా ఒక చిత్రం తెరకెక్కుతోంది. అదే టైగర్ నాగేశ్వరరావు..
రవితేజా హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ వీడియోని తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పలువురు స్టార్ హీరోలు రిలీజ్ చేశారు. తెలుగులో విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేయడంతో పాటు రవితేజా పాత్రను వెంకీ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ లో విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఒకెత్తైతే...గ్లిమ్స్ ఎండింగ్ లో జింకలను వేటాడే పులిని చూసుంటావు...పులిని వేటాడే పులిని చూశావా అంటూ రవితేజా చెప్పిన డైలాగ్ ఒక రేంజ్ లో ఉంది. ఈ ఫస్ట్ లుక్ తోనే సినిమా సగం పాసయింది.
మాస్ రాజా కెరీర్ లో టైగర్ నాగేశ్వరరావు చిత్రం బిగెస్ట్ టర్నింగ్ పాయింట్ అయ్యేలా ఉంది. ఈ సినిమా రవితేజా కెరీర్ లో వస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ. దసరా కానుకగా అక్టోబర్ 20న తెలుగుతో పాటు ఐదు భాషల్లో విడుదల కానుంది. 1970-80 ప్రాంతంలో స్టువర్టుపురం గజదొంగగా పోలీసులకు నిద్ర లేకుండా చేసిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో చిత్రాన్ని రూపొందిస్తుండడంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఉంది. ఇందులో రవితేజా పాత్ర భిన్నంగా ఉంటుందని ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ , కాస్ట్యూమ్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయని టాక్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ వీడియో ఆ అంచనాలకు తగ్గట్టుగా ఉండడంతో బాక్సాఫీస్ ను టైగర్ నాగేశ్వరరావు దోచుకోవడం ఖాయమని ఇది 100 కోట్ల బొమ్మని టాక్ వినిపిస్తోంది. మరి, టైగర్ నాగేశ్వరరావు ఏ రేంజ్ లో పంజా విసురుతాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.