Murder Movie Trailer Released: ఉత్కంఠ భరితంగా వర్మ 'మర్డర్' మూవీ ట్రైలర్!
Murder Movie Trailer Released: లాక్ డౌన్ వలన మేకర్స్ అందరూ ఖాళీగా ఉంటే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం అందుకు విరుద్దంగా వరుస పెట్టి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.
Murder Movie Trailer Released: లాక్ డౌన్ వలన మేకర్స్ అందరూ ఖాళీగా ఉంటే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం అందుకు విరుద్దంగా వరుస పెట్టి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే నగ్నం, క్లైమాక్స్, పవర్ స్టార్ చిత్రాలను తెరకెక్కించి అర్జీవీ వరల్డ్ ధియెటర్లో విడుదల చేసిన వర్మ తాజాగా 'మర్డర్' (కుటుంబ కథా చిత్రమ్ అనేది ట్యాగ్ లైన్) సినిమా ట్రైలర్ మంగళవారం విడుదల చేశాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టుగా వర్మ చిత్ర ట్రైలర్ లో పేర్కొన్నాడు.
ఇక ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక ప్రేమ కథ రెండు కుటుంబాలను ఎలా చిన్నాభిన్నం చేసిందనేది సినిమాలో చూపిస్తున్నాడు వర్మ.. ఇక ఈ సినిమా ట్రైలర్ ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకే సారి రిలీజ్ చేశారు వర్మ.. సింగిల్ డైలాగ్ లేకుండా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే ట్రైలర్‌ను నడిపించాడు వర్మ.. ఇక చిత్ర ట్రైలర్ లో పిల్లలను ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా? పిల్లలను కనగలం గాని వాళ్ల మనస్తత్వాలను కనగలమా? అనే టైటిల్స్‌తో చిత్ర ట్రైలర్ కొనసాగింది.
రాంగోపాల్ వర్మకు GHMC నోటీసులు :
డిపార్ట్మెంట్ యాక్షన్ ఉల్లంఘించి పబ్లిక్ ప్లేస్ లో పోస్టర్లు వేసినందుకు గాను దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నాలుగు వేల జరిమానా విధించారు జిహెచ్ఎంసి అధికారులు.. తాజాగా అయన తెరకెక్కించిన పవర్ స్టార్ సినిమా పోస్టర్ గురించి రామ్ గోపాల్ వర్మ పై జిహెచ్ఎంసి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు ఓ నగర పౌరుడు.. దీనిపైన స్పందించిన అధికారులు నిబంధనల ప్రకారం పోస్టర్ కు రెండు వేల చొప్పున 4000 జరిమానాను విధించారు. జూబ్లీహిల్స్లోని రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ కి నోటీసులని పంపించారు అధికారులు.