సుమ రెమ్యునరేషన్ పై రాజీవ్ కనకాల కామెంట్స్

Update: 2019-05-15 07:46 GMT

తెలుగు బుల్లితెర పై యాంకర్ అనే పదం వినగానే ముందుగా గుర్తొచ్చేది సుమ పేరే. మలయాళీ అయినప్పటికీ అంతగా ఆమె తెలుగు ప్రేక్షకులతో కలిసిపోయింది. తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ టీవీ షో లైన సినిమా వేడుకలైనా ముందుగా వేదికపై కనిపించేది సుమనే. గత కొంతకాలంగా ఆమె తీసుకునే పారితోషికం గురించి కొన్ని పుకార్లు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుమ భర్త రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చారు. ఆమె ప్రతిభ, పనితనమే ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టాయి అని రాజీవ్ కనకాల అన్నారు.

సుమ స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది కానీ ఆ వార్తల్లో నిజం లేదు. రెమ్యూనరేషన్ పక్కన పెడితే ఆమె కష్టం మామూలుది కాదు. సినిమా వారు కేవలం కొన్ని నిమిషాల పాటు లైట్ల వెలుతురులో నటిస్తారు కానీ సుమకు మాత్రం గంటల తరబడి వెలుతురులో ఉండాల్సి వస్తుంది. పెద్ద పెద్ద సౌండ్స్ మధ్య అలా గంటల తరబడి నిలబడి మాట్లాడటం అంత ఈజీ కాదు. సుమ ఎన్ని లక్షలు పారితోషికం తీసుకుంటుందో నాకైతే తెలీదు. తను ఎంత సంపాదిస్తుంది అనే విషయాన్ని నేను తెలుసుకొని పెత్తనం చేయాలని అనుకునే మనిషిని కాదు" అని అన్నారు రాజీవ్ కనకాల.

Similar News