MAA Elections: మంచు విష్ణు ప్యానెల్‌పై ఎన్నికల అధికారికి ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు
* "మా" ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని కంప్లయింట్ * "మా" లో పోస్టల్ బ్యాలెట్ కుట్ర జరుగుతోందని ఆరోపణ
MAA Elections: "మా" ఎన్నికలు మరింత వేడెక్కాయి. పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ.. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానల్ మధ్య వార్ పెరుగుతోంది. దీంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తాజాగా మంచు విష్ణు ప్యానల్‌పై "మా" ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు ప్రకాశ్‌రాజ్ అండ్ టీమ్. మంచు విష్ణు ప్యానల్ "మా" ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తోందని కంప్లయింట్ ఇచ్చారు.
"మా" లో పోస్టల్ బ్యాలెట్ కుట్ర జరుగుతోందని ఆరోపించారు ప్రకాశ్‌రాజ్. ఏజెంట్ల ద్వారా ఈ కుట్ర జరుగుతోందన్న ఆయన 60ఏళ్లు పైబడినవారే పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులన్నారు. 56 మందికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్‌కు ఓ వ్యక్తి నిన్న సాయంత్రం డబ్బులు చెల్లించారని ఫిర్యాదు చేశారు. ఈ అంశాలపై ఎన్నికల అధికారులు పరిశీలించాలని కోరారు.
అర్హత ఉన్న సభ్యుల నుంచి విష్ణు ప్యానెల్ సంతకాలు సేకరిస్తోందని, విష్ణు తరపు వ్యక్తి నిన్న 56 మంది సభ్యుల తరపున 28వేలు చెల్లించారని ఆరోపించారు. కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్, శరత్‌బాబు పోస్టల్ బ్యాలెట్ డబ్బులు కూడా మంచు విష్ణు తరపు వ్యక్తే కట్టారన్నారు. ఈ విషయంపై పెద్దలు కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలని అన్నారు ప్రకాశ్‌రాజ్.