రాజ్ తరుణ్ ఎక్కడ? యాక్సిడెంట్ చేసిన వారెవరు?
చిన్న యాక్సిడెంట్.. పెద్ద సంచలనం.. ఆ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు.. కానీ కారు వదిలి వెళ్ళిపోయారు.. వెళ్ళిన వారు సెలబ్రిటీగా చెప్పుకుంటున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ లలో చూసిన వారు అది నటుడు రాజ్ తరుణ్ అంటున్నారు. ఇప్పుడు ఇది ఇటు టాలీవుడ్ లో అటు పోలీసుల్లో ఉత్కంఠ రేపుతోంది.

మొన్న రాత్రి సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారు ప్రమాదానికి గురైంది. పక్కనే ఉన్న డివైడర్ ఎక్కింది. అయితే, ఆ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తి కారు దిగి ఫోను మాట్లాడుకుంటూ వేల్లిపోయినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. కానీ, ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ఇంకా అధికారికంగా తేలలేదు. ముందు అది సినీ నటుడు తరుణ్ అని ప్రచారం జరిగింది. అయితే, తరుణ్ తనకేం కాలేదనీ, అది తన కారుకాదనీ చెప్పారు. తరువాత ఆ వ్యక్తి రాజ్ తరుణ్ అని ప్రచారం జరుగుతోంది.
కానీ, ఇప్పటివరకూ ఇటు రాజ్ తరుణ్ కానీ, అటు పోలీసులు కానీ ఈ విషయం పై స్పష్టత ఇవ్వలేదు. నిజానికి ఇప్పటివరకూ రాజ్ తరుణ్ పోలీసులకూ అందుబాటులోకి రాలేదు. ఇక పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా.. సీసీ కేమేరాల్లోని వ్యక్తి రాజ్ తరుణ్ అని ఇతమిత్థంగా చెప్పటం లేదు. అయితే, కారు ఎవరిదనే విషయం కూడా ఇప్పటివరకూ స్పష్టంగా తెలియరాలేదు. దీంతో అసలు రాజ్ తరుణ్ ఎక్కడున్నారు? కారు ఎవరిది? అసలు ప్రమాద సమయంలో ఉన్న వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయం మీద రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.