'రంగస్థలం' సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరొక బ్లాక్ బస్టర్ సినిమా నమోదు చేసుకుంటాడు అని అందరూ అనుకుంటుండగా చెర్రీ మాత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'వినయ వినయ రామా' సినిమాలో నటించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో నే కాక ఓవర్సీస్లో సైతం ఈ సినిమా మంచి కలెక్షన్లను నమోదు చేసుకోలేక పోయింది. ఆఖరి రన్ లో 'వినయ విధేయ రామ' ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద $260k సంపాదించింది. నిజానికి స్టార్ హీరో సినిమా అంటే కేవలం ప్రీమియర్ లతోనే బోలెడంత వసూళ్లు వస్తాయి కానీ ఈ విషయంలో 'వినయ విధేయ రామ' కలెక్షన్లు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆ రికార్డును ఇప్పుడు మరొక తెలుగు సినిమా బ్రేక్ చేయబోతోంది. అది క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన 'ఎన్టీఆర్ మహానాయకుడు'. ఎన్టీఆర్ బయోపిక్ లో ని మొట్ట మొదటి భాగం గా 'ఎన్టీఆర్ కథానాయకుడు' ప్రేక్షకులు ముందుకు వచ్చింది కానీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. ఆ ఎఫెక్టు ఎన్టీఆర్ బయోపిక్ లో రెండవ భాగమైన 'ఎన్టీఆర్ మహానాయకుడు' పైన భారీగా పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా వసూళ్లు $200k. ఎంత కష్టపడినా ఈ సినిమా మరొక 60 డాలర్లను సంపాదించే పరిస్థితి లేదని అర్థమవుతుంది. ఇలా చూసుకుంటే 'వివిఆర్' రికార్డును 'ఎన్టీఆర్ మహానాయకుడు' బ్రేక్ చేసి ఓవర్సీస్ లో అతి తక్కువ కలెక్షన్లను నమోదు చేసుకున్న సినిమా గా మిగిలిపోనుంది.