షారూఖ్ కొడుకు ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన ఎన్సీబీ
*ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్
Mumbai: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రూయిజ్ నౌక డ్రగ్స్‌కేసులో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తనయుడికి ఊరట లభించింది. అతడికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడంతోనే క్లీన్ చిట్ ఇచ్చినట్టు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో-ఎన్‌సీబీ తెలిపింది. గతేడాది అక్టోబరులో నమోదైన ఈ కేసులో ఆర్యన్‌తో పాటు 19 మంది అరెస్టు అయ్యారు. ఇద్దరు మినహా అందరూ బెయిల్‌పై బయటికొచ్చారు. ప్రస్తుతం ఆర్యన్‌తో పాటు మరో ఐదుగురికి వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థ ఎలాంటి ఆధారాలను సేకరించలేదని ఎన్‌సీబీ అధికారి సంజయ్ కుమార్ తెలిపారు. అప్పట్లో ఈ కేసు బాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపింది. కావాలనే ఆర్యన్‌ఖాన్‌ను ఇరికించారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి.
గతేడాది అక్టోబరు 3న ముంబై తీరంలోని ఓ క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ ఉన్నాయంటూ సమాచారం అందడంతో ఎన్‌సీబీ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆర్యన్‌తో సహా మొత్తం 20 మందిని ఎన్‌సీబీ అదుపులోకి తీసుకుంది. ఆ తరువాత 14 మందిని నిందితులుగా పేర్కొంటూ 6వేల పేజీల ఛార్జిషీట్‌ను ఎన్‌సీబీ దాఖలు చేసింది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ మూడు వారాలకు పైగా జైలులో గడిపాడు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ అమాయకుడని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలో లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఇద్దరు అధికారులను ఎన్సీబీ తప్పించింది. విశ్వ విజయ్ సింగ్, అశిష్ రాజన్ ప్రసాద్‌లు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇన్‌చార్జిగా, డిప్యూటీ ఇన్వెస్టిగేషన్ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. అయితే వీళ్లిద్దరూ అనుమానిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలిందని, అందుకే వీళ్లను తప్పించినట్లు ఎన్‌సీబీ స్పష్టం చేసింది.
క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసు బాలీవుడ్‌ను కుదిపేసింది. కేసు దర్యాప్తులో భాగంగా పలువురు నటుల ఇళ్లలో ఎన్‌సీబీ తనిఖీలు చేసింది. కావాలనే ఆర్యన్‌ను అరెస్టు చేయించినట్టు ఎన్‌సీబీ ఆరోపించింది. ఈ కేసులో ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేతో బీజేపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని విమర్శించింది. దీంతో సమీర్ వాంఖడేను ఈ కేసు నుంచి ఎన్‌సీబీ తప్పించింది. ఆ తరువాత కేసును సిట్‌కు అప్పగించింది. మొదటి నుంచి ఈ కేసులో ఆర్యన్‌కు సంబంధించి ఎలాంటి ఆధారలు లేవని వాదించారు. తాజాగా ఎన్‌సీబీ కూడా అదే నిజమని వెల్లడించింది. దీంతో బాలీవుడ్‌కు చెందిన పలువురు ఆర్యన్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.