Shyam Singha Roy Movie Review: ఈ మధ్యన "టక్ జగదీష్" సినిమాతో డిజాస్టర్ అందుకున్న నాచురల్ స్టార్ నాని తన ఆశలన్నీ తన తదుపరి సినిమా ఆయన "శ్యామ్ సింగారాయి" పైనే పెట్టుకున్నాడు. "టాక్సీ వాలా" ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్లు ఉండటం విశేషం. సాయి పల్లవి, కృతి శెట్టి, మరియు మడోన్నా సెబాస్టియన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజర్ మరియు ట్రైలర్ లతోనే ఈ సినిమా పీరియడ్ బ్యాక్ డ్రాప్ తో సాగనుందని సాయి పల్లవి ఒక దేవదాసీ పాత్రలో కనిపించబోతుంనట్లు గా తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిసెంబర్ 24న 2021 విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూసేద్దామా..
చిత్రం: శ్యామ్ సింగారాయి
నటీనటులు: నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, జిషు సేన్ గుప్త, మురళి శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: సను జాన్ వర్గీస్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
దర్శకత్వం: రాహుల్ సంకృత్యాయన్
బ్యానర్: నిహారిక ఎంటర్టైన్మెంట్
విడుదల తేది: 24/12/2021
కథ:
వాసుదేవ్ (నాని) డైరెక్టర్ అవ్వాలని ఎప్పటినుంచో కలలు కంటూ ఉంటాడు. అప్పుడే కీర్తి (కృతి శెట్టి) తో ఒక షార్ట్ ఫిలిం తీస్తాడు. మొదటి షార్ట్ ఫిలిం తోనే మంచి విజయాన్ని సాధిస్తాడు కానీ కొన్ని చట్ట పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటాడు. 1970లలో శ్యామ్ సింగరాయి (నాని) అనే ఒక అతను రాసిన కథల ఆధారంగా వాసు తెలీకుండానే సినిమాలు తీస్తుంటాడు. అసలు శ్యామ్ సింగరాయి ఎవరు? అతనికి వాసుకి మధ్య సంబంధం ఏంటి? సినిమాలో సాయి పల్లవి పాత్ర ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
నటీనటులు:
ఇంతకు ముందు సినిమాలు అన్నిటితో పోల్చినా సరే నాని ఈ సినిమాలో చేసినటువంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు. అయినా సరే నాని తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. తన పాత్రలో ఒదిగిపోయి శ్యామ్ సింగరాయ్ పాత్రకి ప్రాణం పోసాడు నాని. నాని మరియు కృతి శెట్టి ల మధ్య ప్రేమ కథ కూడా చాలా బాగుంటుంది. రెండో సినిమానే అయినప్పటికీ కృతి శెట్టి ఈ సినిమాలో చాలా బాగా నటించింది. సాయిపల్లవి ఈ సినిమాకి అతి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. తన అద్భుతమైన నటన మరియు ఆమె డాన్స్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ లు అవుతాయి. తన పాత్రలో కూడా బాగానే నటించింది మడోన్నా. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతికవర్గం:
ఈ సినిమా కోసం ఒక ఆసక్తికరమైన కథను ఎంచుకున్నాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్. పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన అప్పటికీ ఈ సినిమాలో చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండటం విశేషం. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో సాగే కథని కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్. మొదటి హాఫ్ చాలా సాదాసీదాగా నటించినప్పటికీ కథ లోకి వెళ్లే కొద్దీ సినిమా చాలా ఆసక్తికరంగా మారుతుంది. సినిమా మొత్తం రాహుల్ తన నెరేషన్ తో చాలా బాగా ఆకట్టుకున్నారు. 1970 లో ఉన్న సామాజిక సమస్యలు దేవదాసీల సిస్టం గురించి చాలా బాగా చూపించారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
బలాలు:
- నటీనటులు
- నేపథ్య సంగీతం
- సినిమాటోగ్రఫీ
బలహీనతలు:
- సెకండ్ హాఫ్ లో కొన్ని అనవసరమైన సన్నివేశాలు
- సెకండ్ హాఫ్ లో పాటలు ఎక్కువగా ఉండటం
- వీక్ క్లైమాక్స్
చివరి మాట:
ఎంత పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో సాగినప్పటికీ సినిమాలో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్ లు ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునేలా చేస్తాయి. కథలోకి వెళ్లే కొద్దీ ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఇరిటేట్ చేయొచ్చు. శ్యామ్ సింగరాయి చనిపోవడానికి స్ట్రాంగ్ రీజన్ లేకుండా పోవడం సినిమాకి ఒక మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ తన పాత్రలో నాని పర్ఫార్మెన్స్ సినిమాకి అతి పెద్ద హైలైట్. సినిమాలో చూపించిన సోషల్ ఇష్యూస్ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. కొన్ని అనవసరమైన సన్నివేశాలు సినిమాని డిస్టర్బ్ చేస్తాయి. కానీ ఓవరాల్ గా సినిమా ఒక మంచి కథ ఉన్న యాక్షన్ డ్రామా.
బాటమ్ లైన్:
దేవదాసీ సిస్టంకి ఎదురు తిరిగిన "శ్యామ్ సింగరాయి" కథ మంచి మార్కులే వేయించుకుంది.