Mr Bachchan: కీలక నిర్ణయం తీసుకున్న మిస్టర్‌ బచ్చన్‌ మూవీ యూనిట్‌..

గతంలో హరీష్ శంకర్‌, రవితే కాంబినేషన్‌లో వచ్చిన షాక్‌ ఆకట్టుకోలేకపోయినా, మిరపకాయ్‌ మాత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.

Update: 2024-08-17 12:33 GMT

Mr Bachchan: కీలక నిర్ణయం తీసుకున్న మిస్టర్‌ బచ్చన్‌ మూవీ యూనిట్‌.. 

రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మిస్టర్‌ బచ్చన్‌'. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి మంచి బజ్‌ ఏర్పడింది. ఇక సినిమా పోస్టర్లు, సాంగ్స్‌, ట్రైలర్‌ విడుదల తర్వాత ఈ బజ్‌ మరింత పెరిగింది.

గతంలో హరీష్ శంకర్‌, రవితే కాంబినేషన్‌లో వచ్చిన షాక్‌ ఆకట్టుకోలేకపోయినా, మిరపకాయ్‌ మాత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో వీరి కాంబనేషన్‌లో వచ్చిన మూడో చిత్రం మంచి విజయం సొంతం చేసుకోవడం ఖాయమని చాలా మంది ఆశించారు. అయితే భారీ అంచనాల నడుమ వచ్చిన మిస్టర్‌ బచ్చన్‌ ప్రేక్షకులను మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సోషల్‌ మీడియా వేదికగా సినిమా చూసిన చాలా మంది నెగిటివ్‌ కామెంట్స్‌ చేయడంతో సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చింది.

హరీష్‌ శంకర్‌ మార్క్‌ కనిపించలేదని, ల్యాగ్‌ ఎక్కువైందంటూ కామెంట్స్‌ చేశారు. మిస్టర్‌ బచ్చన్‌లో అనవసరమైన సన్నివేశాలు ఉన్నాయని. సినిమా లెంగ్త్‌ ఎక్కువగా ఉన్నట్లు మెజారిటీ నెట్టింట అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చిత్రాన్ని 13 నిమిషాల నిడివి తగ్గించినట్టు పేర్కొంది. ఈ మేరకు మూవీ నిర్మాణ సంస్థ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ట్విట్టర్‌ వేదికగా అధికార ప్రకటన చేసింది. 'సోషల్‌ మీడియాలో వస్తన్న క్రిటిసిజం, ఫీడ్‌ బ్యాక్‌ ఆధారం సినిమా నిడివిని 13 నిమిషాలకు తగ్గించాం. దీంతో ఇప్పుడు ఈ మూవీ మరింత ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా ఉంటుందని నమ్ముతున్నాం' అంటూ రాసుకొచ్చారు.

ఎక్కువగా ట్రోల్స్‌ గురైన కొన్ని సీన్స్‌ను సినిమాలోని తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం మీద 13 నిమిషాల నిడివి తగ్గించారు. మరి రాఖీ పండగ నేపథ్యంలో లాంగ్ వీకెండ్ ఉండడం, సినిమా నిడివి తగ్గించడం మిస్టర్‌ బచ్చన్‌ కలెక్షన్ల విషయంలో ఏమైనా కలిసొస్తుందా అనేది తెలియాలంటే సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.


Tags:    

Similar News