Chiranjeevi: అప్పుడు చాలా బాధపడ్డా.. కానీ ఇప్పుడు..
Chiranjeevi at IFFI: మెగాస్టార్ చిరంజీవి 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు అందుకున్నారు.
Chiranjeevi at IFFI: మెగాస్టార్ చిరంజీవి 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు అందుకున్నారు. ఇండియన్ బెస్ట్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డును చిరంజీవి తీసుకున్నారు. ప్రధాని ఫోన్ చేయడంతో తాను చాలా హ్యాపీగా ఫీలయ్యానన్నారు. ఈ అవార్డు తన అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని చిరంజీవి తెలిపారు. నేను ఈ స్థాయికి రావడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానులే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. నేను ఈ స్థాయికి వచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గతంలో నేను ఇలాంటి వేడుకల్లో పాల్గొన్నా. కానీ అప్పుడు దక్షిణాదికి చెందిన ఒక్క నటుడి ఫోటో లేదని బాధపడ్డా. కానీ ఇప్పుడు ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చింది అంటూ చిరంజీవి తెలిపారు.