మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ తన సినిమాలకు థియేటర్లు దొరకడం లేదంటూ మండిపడుతున్నారు మంచు లక్ష్మి. "రాత్రిపగలు కష్టపడి మా రక్తం ధారపోసి సినిమా చేశాం. కుటుంబాల్ని వదిలేసి పనిచేస్తాం. కానీ ఏదో సినిమా వస్తుందని మా సినిమాను పీకేస్తున్నారు. అందుకే చాలా హర్ట్ అయ్యాను. పెద్ద-చిన్న అని చూడరు. ఐదారుగురి చేతిలోనే థియేటర్లన్నీ ఉన్నాయి కానీ అడిగేవాళ్లు ఎవరు లేరు. మోహన్ బాబు కూతురు సినిమా కాబట్టి ఓ వారం రోజులైనా థియేటర్లలో ఉంచుదామనే ఆలోచన కూడా చేయరు." అని అన్నారు మంచు లక్ష్మి.
థియేటర్ల మాఫియాపై కూడా విరుచుకుపడ్డారు. 'మిసెస్ సుబ్బలక్ష్మి' అనే వెబ్ సిరీస్ లాంఛ్ సందర్భంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆమె ఇలా అన్నారు. తను నటించిన ఎన్నో మంచి సినిమాల్ని కారణం లేకుండా థియేటర్ల నుంచి తీసేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. అంతే కాక తను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో పాత్రలన్నీ విభిన్నంగా ఉంటాయని, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు మంచు లక్ష్మి. తాను కోరుకున్న అవార్డులన్నీ వచ్చేశాయని, ఇకపై కేవలం సంతోషం కోసమే పనిచేస్తాను అని తేల్చి చెప్పేస్తోంది మంచు లక్ష్మి.