సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన 'మహర్షి' సినిమా మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రంగా మే 9న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి వారంలోనే తన సినిమాల రికార్డులన్నిటినీ 'మహర్షి' బ్రేక్ చేస్తోంది అని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదివరకటితో పోలిస్తే మహేష్ లో పెద్ద మార్పు వచ్చింది అని చెప్పచ్చు. సినిమాల బిజినెస్, ట్రేడ్ లెక్కల గురించి మహేష్ ఎప్పుడూ మాట్లాడలేదు కానీ తన 25వ సినిమా విషయంలో వసూళ్ల గురించి మాట్లాడడం అందరినీ షాక్ కి గురి చేసింది.
ఇక తన కెరీర్ లో నమ్రత పాత్ర గురించి అడిగిన ప్రశ్నకు "నా భార్య నా బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్. నేను ఎప్పుడు కన్ఫ్యూషన్ లో ఉన్నా తనే ఇనిషియేషన్ తీసుకుని నన్ను ముందుకు నడిపించింది. 'స్పైడర్', 'బ్రహ్మోత్సవం' లాంటి ఫ్లాప్ లు వచ్చినప్పుడు నమ్రత నాకు అండగా నిలిచి 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను', 'మహర్షి' లాంటి సినిమాలు ఎంపిక చేసింది." అని చెప్పుకొచ్చాడు మహేష్. ఇక సితార, గౌతమ్ గురించి మాట్లాడుతూ, "మహర్షి సినిమాని మా ఇంట్లో హోమ్ థియేటర్ లో చూసింది సితార. తన ప్రతి ఫీలింగ్ జెన్యూన్. తన ఎమోషన్ జెన్యూన్" అని అన్న మహేష్ గౌతమ్ ని చూస్తే గర్వంగా ఉంటుందని మహేష్ అన్నారు.