Wedding Diaries: పెళ్లి అర్థాన్ని చెప్పేలా 'వెడ్డింగ్‌ డైరీస్‌'.. ఆసక్తికరంగా ట్రైలర్‌..

Wedding Diaries: వివాహ వ్యవస్థకు సంబంధించి ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి, మంచి విజయాన్ని సాధించాయి కూడా.

Update: 2024-08-21 10:03 GMT

Wedding Diaries: పెళ్లి అర్థాన్ని చెప్పేలా 'వెడ్డింగ్‌ డైరీస్‌'.. ఆసక్తికరంగా ట్రైలర్‌..

Wedding Diaries: వివాహ వ్యవస్థకు సంబంధించి ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి, మంచి విజయాన్ని సాధించాయి కూడా. తాజాగా ఇదే జోనర్‌లో మరో సినిమా వస్తోంది. పెళ్లి బంధంలో ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే ఆసక్తికరమైన అంశాలంతో 'వెడ్డింగ్‌ డైరీస్‌' అనే సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఆస్కార్ అవార్డ్‌ విన్నర్ చంద్రబోస్‌ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఎమ్ వి ఆర్ స్టూడియోస్ పతాకం పై డాక్టర్ మిద్దె విజయవాణి సమర్పణలో వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో "వెడ్డింగ్ డైరీస్" సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చాందిని తమిలారసన్ హీరో హీరోయిన్‌లుగా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 23వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. చంద్రబోస్ ట్రైలర్‌ను విడదుల చేశారు.

ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ.. "వెడ్డింగ్ డైరీస్ చిత్ర ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. పెళ్లి తర్వాత వచ్చే అపార్ధాలు అపోహలు వస్తూ పోతూ ఉంటాయి కానీ శాశ్వతం కాదు. శాశ్వతం గా ఉండేది వైవాహిక బంధం మాత్రమే అనే మంచి కథతో ఈ వెడ్డింగ్ డైరీస్ చిత్రంతో మన ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను. హీరోగా నటించిన అర్జున్ అంబటి టాలెంట్ ఉన్న నటుడు అలాగే హీరోయిన్ చాందిని తమిలారసన్ గారికి దర్శకుడు వెంకటరమణ మిద్దె గారికి నా శుభాకాంక్షలు. అలాగే సంగీత దర్శకుడు మదిన్ ఎస్ కె మంచి పాటలు స్వరపరిచారు. ఈ చిత్రంలో పని చేసిన అందరికి నా శుభాకాంక్షలు. ఆగస్టు 23న విడుదల అవుతుంది. అందరు చూసి ఈ చిత్రానికి మంచి విజయం అందించాలి" అని చెప్పుకొచ్చారు.

ఇక హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ "ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చంద్ర బోస్ గారు మా చిత్ర ట్రైలర్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. మా వెడ్డింగ్ డైరీస్ చిత్రం ఆగస్టు 23న విడుదల అవుతుంది. మంచి కుటుంబ కథ చిత్రం. ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడాల్సిన చిత్రం" అని తెలిపారు. ఇక దర్శక నిర్మాత వెంకటరమణ మిద్దె మాట్లాడుతూ "వివాహిత జీవితంలో వాళ్ళకి ఎదురైయే ఇబ్బందులు, సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో చూపిస్తుంది. రోజూ జరిగే గొడవలు, విభేదాలతో విసిగి వారు విడిపోవాలని నిర్ణయిస్తారు. కానీ, తర్వాత ప్రేమను, తమ బంధాన్ని ఎంత విలువైనదో గుర్తించి మళ్లీ కలుసుకుని, పెళ్లిని పునర్ నిర్మించుకోవాలని  నిర్ణయించుకుంటారు.  ఈ చిత్రం ప్రేమ, దీర్ఘకాలిక సంబంధాలపై ఉన్న విలువలను వివరిస్తుంద'ని తెలిపారు. 

Full View


Tags:    

Similar News