లిసా త్రీడి మూవీ రివ్యూ..

Update: 2019-05-24 12:42 GMT

విడుదల తేదీ : మే 24, 2019

నటీనటులు : సామ్ జోన్స్, అంజలి, యోగి బాబు, మైమ్ గోపి

దర్శకత్వం : రాజు విశ్వనాథ్

నిర్మాత : సురేష్ కొండేటి

సంగీతం : సంతోష్ దయానిధి

సినిమాటోగ్రఫర్ : పి జి ముత్తయ్య

గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న అంజలి తాజాగా 'లిసా 3డి' అనే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజు విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఇవాళ అనగా మే 24 న విడుదలైంది. పీజీ మీడియా వర్క్స్ పతాకంపై పి జి ముత్తయ్య నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ దయానిధి సంగీతాన్ని అందించారు. 'గీతాంజలి', 'చిత్రాంగద' వంటి హారర్ సినిమాలలో నటించిన అంజలి ఈ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టనుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూసేద్దామా..

కథ:

లిసా (అంజలి) తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తన తల్లి తనని పెంచురుంది. అయితే ఒకసాయి లిసా అమెరికా వెళ్ళాలి అనుకుంటుంది. దానికంటే ముంది తన అమ్మమ్మ, తాతయ్యలని ఒకసారి కలవాలి అనుకుంటుంది. కానీ లిసా కి అక్కడే ఒక ఆముకొని సమస్య వచ్చి పడుతుంది. ఆమెకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? అసలు లిసా అమ్మమ్మ తాతయ్య లని ఎందుకు కలవాలి అనుకుంది? అక్కడ ఏం జరిగింది? అనేది తెరపై చూడాలి.

నటీనటులు:

ఈ సినిమాలో అంజలి నటన పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హారర్ సినిమాల్లో నటించిన అనుభవం తో అంజలి కి ఈ సినిమాలో నటించటం సులువైంది. ఆమె అద్భుతమైన నటనను కనబరిచింది. పైగా సినిమా మొత్తం తన పాత్ర చుట్టూనే తిరుగుతున్నప్పటికీ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అంజలి. మకరంద్ దేశ్ పాండేకి ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. ఆయన ఆ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. యోగి బాబు కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయింది. మైమ్ గోపి తన పాత్రలో ఒదిగిపోయి నటించారు. సురేఖ వాణి, సబితా రాయి తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. కళ్యాణి నటరాజన్ తన పాత్రకు బాగానే సెట్ అయింది.

సాంకేతిక వర్గం:

దర్శకుడు రాజు విశ్వనాథ్ ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన కథను ప్రిపేర్ చేసుకున్నారు. కానీ ఆ పాయింట్ అందరినీ అంత లా ఎక్సైట్ చేయలేకపోయింది. మిగతా అన్ని హారర్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా లో కొత్తగా మనం చూడాల్సింది ఏమి లేదు. సినిమా మొత్తం రొటీన్ గా నే సాగిపోయింది. రొటీన్ కథ ని ఆసక్తికరం గా చెప్పాల్సిన దర్శకుడు కొన్ని సన్నివేశాల తో విపరీతం గా బోర్ కొట్టించేసాడు. ఈ సినిమా లో వచ్చే అనేకమైన ట్విస్టులు అసలు సినిమా కి సంబంధం లేదు అనిపిస్తుంది. నిర్మాత ఈ సినిమా కి అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నిర్మాతే ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా కూడా పని చేశారు. ఈ సినిమాకి గ్రాండ్ విజువల్స్ ప్లస్ పాయింట్ గా మారాయి. సంతోష్ దయానిధి అందించిన సంగీతం చాలా బాగా వర్కౌట్ అయింది. పాటల సంగతి పక్కన పెడితే సంతోష్ అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని సన్నివేశాలను కీలక సన్నివేశాలను మరింత బాగా ఎలివేట్ చేశాయి. ఎస్ ఎన్ ఫాజిల్ ఎడిటింగ్ బాగుంది.

తీర్పు:

మిగతా అన్ని హారర్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అన్ని విధాలుగా కొత్తదనం చూపించడానికి చిత్రబృందం ప్రయత్నించినా కానీ అది పెద్దగా వర్క్ అవుట్ అయినట్లు అనిపించలేదు. ఒక మూస ధోరణిలో వెళ్తున్న హారర్ సినిమాల మాదిరి గా నే ఈ సినిమా కూడా తెరకెక్కించబడింది. అలాగే ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ మరింత బలాన్ని చేకూర్చాయి అని చెప్పడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఆసక్తికరంగా మొదలైన ఈ సినిమా మొదటి నుంచి ఆఖరి వరకు ప్రేక్షకులను అనుకున్న స్థాయి లో ఆకట్టుకోలేకపోయింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు మంచి ఔట్పుట్ ని ఇచ్చారు. ప్రతి సీన్ ఆసక్తికరంగా ఉండాల్సిన సినిమా లో చాలా వరకు బోరింగ్ సీన్లే ఎక్కువ ఉన్నాయి. దర్శకుడు కథను నెరేట్ చేయడం లో కూడా విఫలమయ్యాడు. చివరగా, 'లిసా 3డి' సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమా అయితే కాదు. హారర్ సినిమాలంటే ఇష్టమున్న వాళ్ళు కూడా ఆదరించడం కష్టమే.

Similar News