Nabha Natesh: బీడీలు కూడా కాల్చాను.. నభా నటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అదుగో' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార నభా నటేష్. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక ఇస్మార్ట్ శంకర్‌తో భారీ హిట్‌న్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మాస్ రోల్‌లో దుమ్మురేపిందీ చిన్నది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో పాటు నభా కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.
ఇక తాజాగా ప్రియదర్శి హీరోగా వచ్చిన 'డార్లింగ్' మూవీతో ప్రేక్షకులను పలకరించిందీ చిన్నది. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నభా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన తొలి సినిమా కోసం ఎంత కష్టపడిందో, సినిమా పట్ల తనకు ఉన్న డెడికేషన్ ఎలాంటిదో చెప్పింది. తన సినిమా కెరీర్‌కు సంబంధించి ఆమె మాట్లాడుతూ.. బెంగళూరులో మోడలింగ్‌తో పాటు ఓ నాటక బృందంలో చేరి నాటకాలు కూడా ప్రదర్శించడం అలవాటు చేసుకున్నానని, అప్పటికే కొన్ని వీధి నాటకాలు కూడా ప్రదర్శించానని తెలిపింది.
ఆ అనుభవంతోనే సినిమాలో ప్రయత్నించాలనే ఆలోచన వచ్చి మొదలుపెట్టానని చెప్పుకొచ్చింది. అప్పుడే కన్నడలో శివ రాజ్‌కుమార్ పక్కన వజ్రకాయలో అవకాశం వచ్చిందని, ఆ షూటింగ్‌కు మూడు నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నానని తెలిపింది. పల్లెటూరి అమ్మాయిలా కనిపించిన ఈ సినిమా కోసం హార్స్ రైడింగ్ నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. ఇక ఈ పాత్ర కోసం బీడీలు కూడా కాల్చానని, ఆ వాసన భరించలేక రెండ్రోజులు ఏమీ తినలేకపోయాను. అయితే తన కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు ఆ సినిమాతో లభించింది అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.
ఇక తనపేరు గురించి కూడా నభా నటేష్ ఆసక్తిర విషయాన్ని పంచుకున్నారు. తన తండ్రి పేరు నటేష్‌లోని మొదటి అక్షరం 'న'ను, తల్లి పేరు 'భాగ్య'లోని మొదటి అక్షరం 'భా'ను తీసుకొని నభా అనే పేరు పెట్టారని చెప్పుకొచ్చింది. నభా అంటే సంస్కృతంలో ఆకాశం అని అర్థమని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.