Kathanika Movie: 'కథానిక' చిత్రం ఏప్రిల్ 23న రిలీజ్

Kathanika Movie: కథానిక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. మంచి గ్రిప్పింగ్ కథ కథనం తో ఊహకందని మలుపులతో ఉంటుంది.

Update: 2021-04-14 10:19 GMT

Kathanika

Kathanika Movie: జగదీష్ దుగన దర్శకత్వంలో మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న తాజా చిత్రం "కథానిక". తెలుగులో మరో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతుంది. థాంక్యూ ఇంఫ్రా టాకీస్ పతాకం‌పై దర్శకత్వంలో శ్రీమతి పద్మ లెంక నిర్మిస్తున్నారు. ఈ చిత్రన్ని ఏప్రిల్ 23న విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మీడియా సమావేవం ఏర్పాటు చేసింది చిత్రబృందం.

సినిమాకు దర్శకత్వం వహించిన జగదీష్ దుగనే సంగీతం బాణీలు కట్టడం విశేషం. జగదీష్ దుగన మీడియా సమావేశంలో మాట్లాడితూ.. "కథానిక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. మంచి గ్రిప్పింగ్ కథ కథనం తో ఊహకందని మలుపులతో ఉంటుంది. మనోజ్ నందన్, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ల నటన ఈ చిత్రానికే హైలైట్ అవుతుందని ఆయన అన్నారు.

నిర్మాత పద్మ లెంక మాట్లాడుతూ.. "కథానిక'' చిత్రానికి ఎంతో ప్యాషన్ తో నిర్మించాం. డైరెక్టర్ గారు చూపిన కథ బాగా నచ్చింది. నిర్మాణ విలువల్లో ఎక్కడ కంప్రమైస్ కాకుండా నిర్మించామం. సినిమా చాలా బాగా వచ్చింది. సంగీతం, కథ కథనం మా చిత్రం లో హైలైట్ గా నిలిచాయి. ఏప్రిల్ 23న రెండు తెలుగు రాష్ట్రలో విడుదల చేస్తున్నాము" అని తెలిపారు. కేర్ అఫ్ కంచరపాలెం ఫేమ్ ఉమా మహేశ్వర రావు, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, బిహెచ్ఈఎల్ ప్రసాద్, బొంబాయి పద్మ, అల్లు రమేష్, నల్లా సీను, బేబీ సంజన, కార్తిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన పోస్టర్ పై అంచనాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News