OTT: ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో 'టీనేజర్స్ 17/18'.. ఆహాలో ట్రెండ్ అవుతోన్న కొత్త సినిమా
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా మంచి కంటెట్ ఉన్న సినిమాలకు ఆదరణ లభిస్తోంది.
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా మంచి కంటెట్ ఉన్న సినిమాలకు ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఇతర భాషల్లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలను తెలుగులో డబ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ మూవీ స్ట్రీమ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అదే ‘టీనేజర్స్ 17/18’ సినిమా.
కన్నడలో వచ్చిన ‘హడినెలెంటు’కి డబ్బింగ్ వర్షన్‌గా ‘టీనేజర్స్ 17/18’ అనే చిత్రం తెలుగు ఆడియెన్స్‌కి ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ చిత్రం ఉంటుంది. యూత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో చూపించారు. ఈ చిత్రానికి అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇక ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించేందుకు ఈ చిత్రం వచ్చేసింది. సెప్టెంబర్ 21 నుంచి ఈ సినిమా ఆహాలోకి వచ్చేసింది. హనుమాన్ మీడియా మీద నిర్మాత బాలు చరణ్ ఈ మూవీని ఆహాలోకి తీసుకొచ్చారు.
మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇలా అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో టీనేజర్స్ చిత్రం అందరినీ ఆకట్టుకుని అవార్డులను సాధించింది. పృథ్వీ కొననూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించారు. ఇక ఈ చిత్రంలో షెర్లిన్ బోస్లే, నీరజ్ మాథ్యూ, రేఖా కుడ్లిగి, సుధా బెలావుడి, భవానీ ప్రకాష్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. అర్థరాత్రి నుంచి ఈ సినిమా ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మిలియన్ల మినిట్ వ్యూస్‌తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే ఆహాలో ఈ సినిమా టాప్ 4లోకి వచ్చేసింది. 12 గంటల్లో 15 మిలియన్ మినిట్ వ్యూస్‌తో ఆహాలో ట్రెండ్ అవుతోంది.