Kalki 2898 AD Box Office: కొనసాగుతోన్న కల్కి 2898 ఏడీ ఊచకోత.. సోమవారం కూడా తగ్గేదేలే...!
Kalki 2898 AD Movie Box Office Collection: ఇప్పటికే రూ. 500 కోట్ల క్లబ్‌లోకి చేరిన కల్కి 2898 ఏడీ మూవీ ప్రస్తుతం రూ. 635 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Kalki 2898 AD Box Office Collection: కల్కి 2898 ఏడీ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. తొలి వారంతంలో జోరు చూపించిన ఈ సినిమా. వారంతం తర్వాత కూడా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. సోమవారం కూడా మంచి కలెక్షన్లను రాబట్టడం విశేషం. ఇప్పటికే రూ. 500 కోట్ల క్లబ్‌లోకి చేరిన కల్కి 2898 ఏడీ మూవీ ప్రస్తుతం రూ. 635 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సోమవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 84 కోట్ల కలెక్ట్ చేయడం విశేషం.
దీంతో కల్కి వసూళ్ల సునామి సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త సినిమాలేవి లేకపోవడం థియేటర్లన్నీ కల్కితోనే నిండిపోవడం కారణంగా ఈ సినిమా సులభంగా రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటేస్తుందని అభిప్రాయపడుతున్నారు. మరో వీకెండ్ కూడా కలిసి వస్తే కల్కి 2898 ఏడీ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. దగ్గర్లో పెద్ద సినిమాలేవి విడుదలకు సిద్ధంగా లేకపోవడం కల్కికి కలిసొస్తుంది. అలాగే ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో కూడా మూవీ యూనిట్ తీసుకున్న నిర్ణయం కలెక్షన్లు పెరగడానికి కారణంగా భావిస్తున్నారు.
కల్కి 2898 ఏడీ ఓటీటీ కనీసం నెల రోజుల తర్వాతే అన్న వార్తల నేపథ్యంలో థియేటర్లకు క్యూ కడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే సోమవారం భారత్‌లో కల్కి 34.6 కోట్లు రాబట్టగా మిగిలిన సుమారు 50 కోట్ల ప్రపంచవ్యాప్తంగా రాబట్టడం విశేషం. ఇదిలా ఉంటే కల్కి ఇప్పటికే సరికొత్త చరిత్రను తిరరాస్తోంది. తొలిరోజు వసూళ్లలో ‘కేజీఎఫ్ 2’, ‘సలార్’, ‘లియో’ వంటి చిత్రాలను అధిగమించిన విషయం తెలిసిందే.
నాగ అశ్విన్ ఐదేళ్ల కృషికి ఫలితం లభించిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ప్రభాస్‌కు సలార్ తర్వాత మరో సాలిడ్ విజయం లభించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. అమితాబ్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటీనటులు నటించిన కల్కి సినిమాను నాగ అశ్విన్ పురాణాలను, ఆధునిక ప్రపంచాన్ని జోడించి తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే షూటింగ్‌కు కూడా ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.