తెలంగాణ విమోచన దినోత్సవం : స్ఫూర్తి కలిగించే సినిమాలు ఇవే!
Telangana Liberation Day : ఆగస్టు 15న 1947న భారతదేశానికి బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి లభించింది. అందుకే ఆ రోజున దేశమంతటా
Telangana Liberation Day : ఆగస్టు 15న 1947న భారతదేశానికి బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి లభించింది. అందుకే ఆ రోజున దేశమంతటా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు.. కానీ హైదరాబాదు ప్రజలు మాత్రం ఆ సంబరాల్లో పాలు పంచుకొనే అదృష్టం లేకుండా పోయింది. ఎందుకంటే అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు. హైదరాబాదు ఇండియాలోనూ, పాకిస్తాన్ లోనూ కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు.
అయితే హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని ఆనాటి హోంశాఖ మంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయించుకున్నారు.. అనేక పోరాటాల తర్వాత సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్ర్యం వచ్చింది. హైదరాబాదు రాష్ట్రం ఏర్పడింది. అందుకే సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తారు.
దీనిని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. అందులో 'రాజన్న' సినిమా ఒకటి.. తెలంగాణ రజాకార్ల ఉద్యమ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్ర పోషించారు. రజాకార్ల పాలనలో ఆనాటి తెలంగాణా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అన్న సన్నివేశాలను కళ్ళకి కట్టినట్టు చూపించారు. సినిమాని ఆదిలాబాదు జిల్లాలోని నేలకొండపల్లి గ్రామ నేపథ్యంలో జరుగుతున్నట్టుగా చూపించారు.
ఇక శంకర్ దర్శకత్వంలో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాలో కొంతభాగం తెలంగాణ రజాకార్ల పాలనలో ప్రజలు ఎలా అణగదొక్కబడ్డారు అన్న అంశాలను అంతర్లీనంగా చూపించారు. తెలంగాణ ఉద్యమానికి ఇది బీజం పోస్తుంది. జగపతిబాబు ఇందులో మూడు పాత్రల్లో కనిపిస్తారు. అలాగే సింధుతులాని ప్రధానపాత్రలో వచ్చిన బతుకమ్మ సినిమాలో ఆనాటి రజాకార్ల పాలనలో మహిళలు బతుకమ్మ ఆడేటప్పుడు నగ్నంగా ఆడామని రజాకార్లు చెప్పేవారని సంభాషణలతో చెప్పారు.
ఇక జై తెలంగాణ, వీర తెలంగాణా మొదలుగు చిత్రాలలో తెలంగాణ రజాకార్ల పాలనలో రాష్ట్రము ఎలా అణగదొక్కబడింది. దీనికి ప్రజలు ఎలాంటి ఉద్యమాలు చేశారు అన్నవి సినిమాల ద్వారా ఆనాటి పరిస్థితులను కళ్ళకి కట్టినట్టు చూపించారు దర్శకనిర్మతాలు. అనేక ఉద్యమాలు, అనేక ప్రాణాలు, అనేక బలిదానాల అనంతరం తెలంగాణ ఓ ప్రత్యేక రాష్ట్రముగా అవతరించింది.