మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న 'సై రా నరసింహ రెడ్డి' సినిమాలో అలెగ్జాండర్ అనే ఒక విదేశీయుడు కూడా చిన్న పాత్ర పోషితున్నాడు. టూరిస్టు వీసా మీద ఈ ఏడాది మొదట్లో షూటింగ్ కోసం ఇండియా వచ్చి కడపలో జరిగిన ఒక షెడ్యూల్లో అతను పాల్గొన్నాడు. ఇక్కడ ఎండ వేడి భరించలేని అతను వడదెబ్బకు గురై మృతి చెందాడు. మరి అతడి పాత్ర చిత్రీకరణ పూర్తయిందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఒక అపార్ట్ మెంట్ లో ఉంటున్న అతను వడ దెబ్బకు గురయ్యాడు.
మృతి కి కారణం వడదెబ్బ అని నిర్ధారితమైంది. తన అపార్ట్ మెంట్ లో అపస్మారక స్థితిలో ఉన్న అలెగ్జాండర్ ను స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి కూడా మార్చారు. కానీ అలెగ్జాండర్ చికిత్స పొందుతూ మరణించారు. అలెగ్జాండర్ కి మిత్రుడైన బోరెజ్ అనే వ్యక్తి కూడా రష్యా నుంచి ఇండియాకు వచ్చారని తెలుస్తోంది. గోవాలో ఉన్న అతడిని హైదరాబాద్ కు పిలిపించి మృతదేహాన్ని అతడికి అప్పగించారు పోలీసులు. అలెగ్జాండర్ ఫొటోగ్రాఫర్ కూడా. అతడి దగ్గర ఉన్న కెమెరాలో 'సైరా' షూటింగ్ అప్పుడు తీసుకున్న ఫొటోలు కుడా కనపడ్డాయి.