Fahadh Faasil: అరుదైన వ్యాధితో బాధపడుతున్న 'పుష్ప' విలన్‌

Fahadh Faasil: మలయాళ స్టార్ యాక్టర్​ ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2024-05-28 07:30 GMT

Fahadh Faasil: అరుదైన వ్యాధితో బాధపడుతున్న 'పుష్ప' విలన్‌

Fahadh Faasil: మలయాళ స్టార్ యాక్టర్​ ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులోనూ ఆయనకు మంచి ఫేమ్ ఉంది. ప్రస్తుతం ఫహాద్ తెలుగులో ‘పుష్ప-2’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘ఆవేశం’ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మధ్య మలయాళ సినిమాలు వరుసగా హిట్ అవుతున్న నేపథ్యంలో ఇంటర్వ్యూలు ఇస్తోన్న ఆయన తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని చెప్పారు. తాను ఓ వ్యాధి బారిన పడినట్లు స్వ‌యంగా తెలిపారు.

41 ఏళ్ల వయసులో అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజార్డర్‌ (ADHD) వ్యాధి నిర్ధరణ అయినట్లు చెప్పారు. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. శ్రద్ధ, ప్రవర్తన, ప్రేరణ నియంత్రణను నియంత్రించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఇది పిల్లల్లో సాధారణమని పెద్దలకు అరుదుగా వస్తుందన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ వ్యాధి చికిత్స గురించి డాక్టర్‌ను అడిగారు. 41 ఏళ్ల వయసులో దీనికి చికిత్స చేయించుకోవచ్చా లేదా అన్న వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు.

Tags:    

Similar News