ఎన్టీఆర్‌తో మనస్పర్థల గురించి శ్రీనివాసరెడ్డి క్లారిటీ

Update: 2019-05-19 09:19 GMT

స్టార్ట్ కమీడియన్ గా బోలెడు సినిమాలలో నటించిన శ్రీనివాసరెడ్డి 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా ముందు వరకు ఎన్టీఆర్ తో కలిసి పెద్దగా నటించలేదు. అయితే వీరి వీరి ఇద్దరి మధ్య ముందు మంచి స్నేహం ఉన్నప్పటికీ కొన్ని అపార్థాల వల్ల వారు దూరం అయ్యారని కానీ త్రివిక్రమ్ చెప్పటం వల్ల మళ్ళీ వీరిద్దరూ కలుసుకున్నారని వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలియజేయడానికి అప్పట్లో శ్రీనివాసరెడ్డి తారక్ తో కలిసి దిగిన సెల్ఫీని కూడా పోస్ట్ చేశాడు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. తాజాగా దీని గురించి క్లారిటీ ఇచ్చాడు శ్రీనివాసరెడ్డి. ఎవరో అనవసరంగా సృష్టించిన వదంతుల వల్ల వారి మధ్య స్నేహం దెబ్బతిందని చెప్పుకొచ్చాడు శ్రీనివాసరెడ్డి.

టిడిపి తరఫున అప్పట్లో ఎన్నికల ప్రచారంలో ఖమ్మంలో ఓ సభ అయ్యాక ఒకే కారులో ప్రయాణించాల్సిన తారక్, శీనులు అనుకోకుండా విడివిడిగా బయలుదేరారు. కాసేపటికే జూనియర్ కారుకు యాక్సిడెంట్ అయ్యి తారక్ తీవ్ర గాయాల పాలయ్యాడు. శ్రీనివాస రెడ్డి వెంటనే తలకు గుడ్డ చుట్టి తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ తారక్ ఫ్రెండ్స్ మాత్రం శీను వల్లే ఇలా అయ్యిందని అనవసరంగా నిందలు వేశారట. శ్రీనివాస రెడ్డి స్పందించకపోతే తారక్ పరిస్థితి విషమించేది అన్నట్టు అర్థ ప్రచారం చేశారట. దానివల్ల గ్యాప్ వచ్చి సినిమాల్లో కలిసి నటించలేదట కానీ మళ్ళీ వారిని 'అరవింద సమేత' సినిమా కలిపింది అన్నమాట. 

Similar News