Bharateeyudu 2: ఓటీటీలోకి వచ్చేసిన భారతీయుడు2.. ఎక్కడ చూడొచ్చంటే..
ఇదిలా ఉంటే ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించారు. సేమ్ కాంబినేషన్‌లో భారతీయుడు 2 చిత్రాన్ని ఇటీవల విడుదల చేశారు.
Bharateeyudu 2: కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 28 ఏళ్ల క్రితం అంటే 1996లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. లంచంపై శంకర్ సంధించిన అస్త్రంగా ఈ సినిమా గురించి అప్పట్లో అభివర్ణించారు. కమల్ హాసన్ అద్భుత నటన, శంకర్ మార్క్ దర్శకత్వం భారతీయుడు చిత్రాన్ని ఒక కళా ఖండగా మార్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలా ఉంటే ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించారు. సేమ్ కాంబినేషన్‌లో భారతీయుడు 2 చిత్రాన్ని ఇటీవల విడుదల చేశారు. జులై 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. సుమారు రూ. 250 కోట్లతో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా తెరకెక్కించారు. అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన భారతీయుడు2 అనుకున్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. అభిమానులను ఈ సినిమా నిరాశపరిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఈ సినిమా ఓటీటీ కూడా ముందుగానే వచ్చేసింది.
నెల రోజుల్లోపై భారతీయుడు 2 ఓటీటీలోకి వచ్చేసింది. తొలుత ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15 న ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే థియేటర్లలో నెగెటివ్ టాక్ రావడంతో ఒక వారం రోజులు ముందుగానే ఓటీటీలోకి తీసుకొచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా భారతీయుడు 2 సినిమా ఆగస్టు 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
శుక్రవారం అర్థరాత్రి నుంచి భారతీయుడు 2 స్ట్రీమింగ్ ప్రారంభమైంది. దీంతో థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లోనూ భారతీయుడు 2 సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్లలో నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి వ్యూస్ దక్కించుకుంటాయో చూడాలి.