తెలుగమ్మాయి అంజలి ఇటు తెలుగులోనే కాక సౌత్ ఇండస్ట్రీ లోని మిగతా భాషల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. 'జర్నీ' సినిమాలో జై తో కలిసి నటించిన ఈమె అప్పటినుంచి అతనితో డేటింగ్ లో ఉందని పుకార్లు బయటకు వచ్చాయి. వారిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు అని కూడా పుకార్లు బయటకు వచ్చాయి. కానీ కొన్నాళ్ల క్రితం వారిద్దరూ విడిపోయారని టాక్ నడిచింది. తాజాగా ఈ విషయంపై అంజలి క్లారిటీ ఇచ్చింది.
బ్రేకప్ విషయం పక్కన పెడితే అసలు తను జై తో ఎటువంటి రిలేషన్షిప్ లోనే లేదని చెప్తోంది అంజలి. అంతేకాకుండా తనకి ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరూ లేరని తనకి పనే ప్రపంచం అని చెప్పుకొచ్చింది. 'ఇప్పటిదాకా నేను రిలేషన్ షిప్ లో ఉన్నాను అని నేను ఎప్పుడూ చెప్పలేదు. నేను చెప్పని వాటికి నేను బాధ్యత తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆ పుకార్లను నేను పట్టించుకోకపోయినా నా కుటుంబ సభ్యులు చదువుతారు నా గురించి వర్రీ అవుతారు" అని చెప్పింది అంజలి. ఇక సినిమాల పరంగా అంజలి నటించిన 'లిసా' సినిమా త్రీడీ హారర్ చిత్రంగా గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజు విశ్వనాద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు