Taapsee Pannu: కొందరితో డేటింగ్‌ చేశా కానీ.. వివాహం తర్వాత తొలిసారి స్పందించిన తాప్సీ

Taapsee Pannu: ఝుమ్మంది నాదం సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార తాప్పీ.

Update: 2024-06-08 13:30 GMT

Taapsee Pannu: కొందరితో డేటింగ్‌ చేశా కానీ.. వివాహం తర్వాత తొలిసారి స్పందించిన తాప్సీ

Taapsee Pannu: ఝుమ్మంది నాదం సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార తాప్పీ. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిందీ చిన్నది. ఇక ఆ తర్వాత ప్రభాస్‌ హీరోగా వచ్చిన మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌తో తొలి కమర్షియల్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆ తర్వాత తెలుగులో ఆశించిన స్థాయిలో మరో విజయాన్ని నమోదు చేసుకోలేకపోయిందీ చిన్నది.

2016లో పింక్‌ మూవీతో బాలీవుడ్‌ బాట పట్టిన తాప్సీకి మంచి రోజులు మొదలయ్యాయి. ఈ సినిమాలో తన అద్భుత నటనతో బాలీవుడ్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన ఈ చిన్నది భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత హిందీలో వరుసగా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో నటించి వరుస విజయాలను అందుకుంది. ఇదిలా ఉంటే కేవలం సినిమాలతోనే కాకుండా ఏదో ఒక కాంట్రవర్సీతో నిత్యం వార్తల్లో నిలిచే తాప్సీ తాజాగా తన వివాహానికి సంబంధించి మరోసారి వార్తల్లోకెక్కింది.

ఈ ఏడాది మార్చిలో తాప్సీ తన స్నేహితుడు మాథిస్‌బోను వివాహమాడిన విషయం తెలిసిందే. కేవలం కొంతమంది సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో వారి వివాహం జరిగింది. అయితే తాప్సీ ఇప్పటి వరకు తన పెళ్లి గురించి ఎలాంటి విశేషాలను పంచుకోలేదు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను మీడియాతో షేర్‌ చేసుకుంది. ఈ సందర్భంగా తన భర్త గురించి కూడా కొన్ని విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ.. తమది ఒక్కరోజులో చిగురించి ప్రేమకాదని, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చింది.

ఇక తనకు కాలేజీ చదువుకునే రోజుల్లో తాను కొంతమంది అబ్బాయిలతో డేటింగ్‌ చేశానని, అయితే మాథిస్‌బోలో తాను పర్‌ఫెక్ట్‌మ్యాన్‌ను చూశానని తాప్సీ పేర్కొంది. మాథిస్‌తో చేసిన ప్రయాణంలో తాను చాలా సెక్యూర్డ్‌గా ఫీలయ్యానని తెలిపిన తాప్సీ.. మాథిస్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కాబట్టి ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనతో ఉంటాడని చెప్పుకొచ్చింది. సవాళ్లను స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వ్యక్తిత్వం మాథిస్‌దని, ఆ లక్షణాలు నచ్చే అతన్ని పెళ్లాడానని అసలు విషయం బయటపెట్టింది.

Tags:    

Similar News