Committee Kurrollu: ఓటీటీలోకి 'కమిటీ కుర్రోళ్లు' వచ్చేస్తున్నారా.? స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇక థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
కథలో దమ్ముండాలే కానీ చిన్న సినిమా అయినా పెద్ద విజయాన్ని అందుకుంటాయి. ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఈ జాబితాలోకి వస్తుంది 'కమిటీ కుర్రోళ్లు'. చిన్న సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుందీ మూవీ. కొత్త నటీనటులతో నూతన దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఆగస్టు 9వ తేదీన థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
ఇక థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. గత కొన్ని రోజుల క్రితం త్వరలో ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ఓ ప్రకటన విడుదల చేయగా తాజాగా. తేదీని కన్ఫామ్ చేశారు. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా ఈ స్ట్రీమింగ్ ప్రారంభంకానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా వెండి తెరకు 15 మంది కొత్త నటులు పరిచయమయ్యారు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. గోదావరి జిల్లాల్లోని ఓ మారుమూల పల్లెటూరు పురుషోత్తంపల్లి. అక్కడ పన్నెండేళ్లకు ఒకసారి జరిగే భరింకాళమ్మతల్లి జాతరకు.. దానిలో భాగంగా చేసే బలి చేట ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఏడాది జరిగిన జాతర తర్వాత పది రోజులకు సర్పంచ్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న సర్పంచ్ బుజ్జి (సాయికుమార్)పై పోటీ చేసేందుకు ఆ ఊరిలో ఉండే శివ (సందీప్ సరోజ్) అనే కుర్రాడు సిద్ధమవుతాడు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి.? సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.