Rashi Khanna: ఆ సమయంలో చాలా భయపడ్డా.. రాశిఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Rashi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార రాశీఖన్నా.
Rashi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార రాశీఖన్నా. తొలి సినిమాలోనే తనదైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ చిన్నది. క్యూట్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రాశీఖన్నాకు అనంతరం వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. టాలీవుడ్ టాప్ యంగ్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది.
ఆ తర్వాత తెలుగుతో పాటు మలయాళం, హిందీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. కాగా తాజాగా ఊహలు గుసగుసలాడే సినిమా విడుదలై 10 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాశీఖన్నా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. టాలీవుడ్‌లో 10 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఈ బ్యూటీ ఆనందాన్ని వ్యక్తి చేసింది. తెలుగులో పదేళ్లు పూర్తి చేసుకున్నానంటే నమ్మలేకపోతున్నాని చెప్పుకొచ్చింది. తొలి సినిమా సమయంలో తనకు తెలుగు భాష రాదని, ఇక్కడి సంస్కృతి తెలియదని కానీ అభిమానులు వారి ఇంటి మనిషిలా సొంతం చేసుకున్నారని తెలిపింది.
ఇక తన ప్రతిభను నిరూపించుకోవడానికి దర్శకులు అవకాశాలు ఇస్తూనే ఉన్నారన్న బ్యూటీ.. తన ట్యాలెంట్‌ను నమ్మి తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసింది. తొలి సినిమా చేస్తున్న సమయంలో చాలా భయపడ్డానని చెప్పుకొచ్చిన రాశీఖన్నా.. కొన్నేళ్ల తర్వాత నటిగా ఇంత కంఫర్ట్ ఇచ్చింది ఆ సినిమానే కదా అనుకున్నాని అంది.
ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు గడిచినా నిన్నే అన్నట్టు అనిపిస్తోందన్న రాశీఖన్నా.. ఆ సినిమాలో తన నటనకు వచ్చిన ప్రశంసల్ని ఎప్పటికీ మర్చిపోలేని, దానికి ఎప్పడూ తన మనసులో ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్పుకొచ్చింది. తెలుగు ప్రేక్షకులు తనపై కురిపించిన ప్రేమ వెలకట్టలేనిదంటూ సంతోషం వ్యక్తం చేసిందీ చిన్నది.