Nayanthara: ఆ పాత్ర నా కెరీర్‌లోనే అత్యంత చెత్త ఎంపిక.. నయన్‌ సెన్సేషన్‌ కామెంట్స్‌..

ఇక ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నయనతార తాజాగా పలు ఆసక్తిర వ్యాఖ్యలు చేసి టాక్‌ ఆఫ్‌ ఇండస్ట్రీగా మారింది.

Update: 2024-06-22 06:39 GMT

ఆ పాత్ర నా కెరీర్‌లోనే అత్యంత చెత్త ఎంపిక.. నయన్‌ సెన్సేషన్‌ కామెంట్స్‌ 

Nayanthara: నయనతారకు ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుందీ బ్యూటీ. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక వివాహం తర్వాత కాస్త సినిమాలు తగ్గించిన ఈ చిన్నది ‘జవాన్’తో బాలీవుడ్‌ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది.

ఇక ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నయనతార తాజాగా పలు ఆసక్తిర వ్యాఖ్యలు చేసి టాక్‌ ఆఫ్‌ ఇండస్ట్రీగా మారింది. తాను నటించిన చిత్రాల్లో అత్యంత చెత్త ఎంపిక ఇదేనంటూ సంచనల వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆ సినిమా మరెంటో కాదు గజినీ. సూర్య హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుందీ మూవీ.

అంతేనా బాలీవుడ్‌లో అమీర్‌ ఖాన్‌ హీరోగా వచ్చి అక్కడ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇంతటి విజయం సాధించిన చిత్రంలో నటించిన నయన్‌ మాత్రం తన పాత్ర తనకు నచ్చలేదని చెప్పుకొచ్చింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఇప్పటివరకు నటించిన మూవీస్ మొత్తంలో ‘గజిని’లో నటించినందుకు మాత్రమే చింతిస్తున్నానంటూ వెల్లడించింది. ఈ సినిమాలో తన పాత్రను త‌న‌కు చెప్పినట్లుగా షూట్ చేయలేదని చెప్పింది. ఆ సమయంలో ఆ విషయాన్ని తాను పట్టించుకోలేదని… దాన్ని ఓ లెర్నింగ్ ప్రాసెస్​గా భావించానట్లు చెప్పుకొచ్చింది. నయనతార చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే నయన్‌ కెరీర్ విషయానికొస్తే ఈ బ్యూటీ చివరిగా.. ‘అన్నపురణి’ అనే లేడీ ఓరియెంటడ్ సినిమాలో కనిపించింది. నయ‌న్ 75గా తెరకెక్కిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక నయనతార ప్రస్తుతం యశ్​ ‘టాక్సిక్’ షూటింగ్‌లో బిజీగా ఉంది. దీంతో పాటు మలయాళంలో నివిన్ పౌలీతో ఓ సినిమాకు సైన్​ చేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News