Acharya Movie: పుస్తకం ఆధారంగా తెరకెక్కనున్న ఆచార్య?
Acharya Movie: ఆచార్య కథ నిజజీవితంలో సుబ్బారావు కథా?
Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "ఆచార్య". మెగాపవర్స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దేవాదాయ భూముల అన్యాక్రాంతం అనే అంశంపై ఈ సినిమా కథ నడవబోతొంది. మంచి సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ అంశాలను కూడా కలిపి కొరటాల ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం "ఆర్ఆర్ఆర్" సినిమా విడుదలైతే తప్ప "ఆచార్య" సినిమా విడుదలయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.
ఇక మరోవైపు "ఆచార్య" సినిమా కథ శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడో 1977లో జరిగిన కథ ఆధారంగా ఉంటుందని ఈ సినిమాని సుబ్బారావు పాణిగ్రాహి అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒరిస్సాకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి శ్రీకాకుళం లోని బొడ్డపాడు అనే గ్రామంలో శివుడి గుడిలో పూజారి గా ఉంటూ భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. ఆయన జీవితం ఆధారంగా ఈ పుస్తకం వ్రాయబడింది. సుబ్బారావు కి అప్పట్లో ఇద్దరు పేరు నక్సలైట్లు కూడా సపోర్ట్ గా నిలిచారు. ఈ కథ ఆధారంగా సినిమా నడుపుతోందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.