Live Updates: ఈరోజు (23 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-11-23 01:57 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 23 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | నవమి - 24:34:32 వరకు తదుపరి దశమి | శతభిష నక్షత్రం - 13:05:20 వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం 08:40:26 నుండి 09:25:22 | అమృత ఘడియలు 11:40:09 నుండి 12:25:04 | దుర్ముహూర్తం 12:25:04 నుండి 13:10:00, 14:39:51 నుండి 15:24:47 | రాహుకాలం 07:49:54 నుండి 09:14:08 | సూర్యోదయం: ఉ.06-23 | సూర్యాస్తమయం: సా.05-39

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-11-23 13:57 GMT

 అమరావతి

* నారా లోకేష్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి

* వీధి రౌడీలు ప్రజాప్రతినిధులు అయితే ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో కాకినాడ డిఆర్సీ సమావేశం జరిగిన తీరు చూస్తే అర్థమవుతోంది.

* వైసీపీ అధినేత నుండి ఎమ్మెల్యేల వరకూ అభివృద్ధితో సమాధానం చెప్పలేక నోటికి పనిచెబుతున్నారు.

* సొంత పార్టీ నాయకులే జరుగుతున్న అవినీతిని ఎండగడుతుంటే కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి టి.డి.పి. ఎమ్మెల్యే జోగేశ్వరరావుని తోసేశారు.

* మరో ఎమ్మెల్యే చినరాజప్పని నోరుమూసేయ్ అంటూ బెదిరించడం వైసీపీ నాయకులు రౌడీయిజాన్ని మరోసారి బయటపెట్టింది.

* టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి రౌడీల పాలనలో ప్రజల పరిస్థితి తలచుకుంటే బాధేస్తోంది.

2020-11-23 13:38 GMT

  అమరావతి...

* ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎంసెట్‌–2020 (అగ్రికల్చర్‌ విభాగం) టాప్‌ ర్యాంకర్‌ జి చైతన్య సింధు.

* సింధును అభినందించిన సీఎం వైయస్‌ జగన్‌.

* వైద్య విద్య పూర్తైన తర్వాత పేదలకు మంచి సేవలందించాలని సూచించిన సీఎం

* చైతన్య సింధు స్వస్ధలం గుంటూరు జిల్లా తెనాలి.

* ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాల ఎంసెట్‌–2020 అగ్రికల్చర్‌ విభాగంలో ఫస్ట్‌ ర్యాంకుతో పాటు నీట్‌–2020లో ఏపీ టాపర్‌గా నిల్చిన చైతన్య సింధు.

* ముఖ్యమంత్రిని కలిసిన సింధు తండ్రి డాక్టర్‌ జి కోటేశ్వర ప్రసాద్, తల్లి డాక్టర్‌ సుధారాణి, చిల్డ్రన్స్‌ స్పేస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా సెక్రటరీ జి.శాంతమూర్తి.

2020-11-23 13:28 GMT

 విశాఖ

- మాజీ ఎమ్మెల్యే విష్ణు కూమార్ రాజు కామెంట్స్

- ప్రతి శనివారం కూల్చివేతలు పనిగా ఈ ప్రభుత్వం పెట్టుకుంటుంది

- శుక్రవారం నోటీసులు ఇచ్చి శనివారం కూల్చి వేస్తున్నారు

- ఇళ్లు వస్తాయని అనుకున్న ప్రజలుకు ఈ ప్రభుత్వం నిరాశ పరుస్తుంది

- జివిఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రజలు హక్కులను హరించే వద్దు

- ఇటువంటి పనులు చేస్తే పెట్టు బడులు పెట్టడానికి ఎం ఒక్కడు రాడు

- చిన్న చిన్న బడ్డీలను సైతం వదలడం లేదు

2020-11-23 11:09 GMT

  అమరావతి....

- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ

- కె.కన్నబాబు, కమిషనర్ విపత్తుల‌ నిర్వహణ శాఖ

- భారత వాతావరణ శాఖ (ఐఎండి) సూచనల ప్రకారం నైరుతి మరియు దాని అనుసంధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

- 24 గంటల్లో తుఫానుగా బలపడనున్న వాయగుండం

- దీని ప్రభావంతో రాగల 3 రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు

- రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు

- బుధవారం, గురువారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు

- మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం

- తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో బలమైన గాలులు

- సముద్రం అలజడిగా ఉంటుంది

- మూడురోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు

- ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసాము

- రైతాంగం వ్యవసాయ పనులయందు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

- తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి

2020-11-23 10:56 GMT

 అమరావతి..

- కింజారపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు

- పత్రికా ప్రకటన

- ముస్లిం సోదరులకు రాష్ట్రంలో జీవించే హక్కు లేదా..?

- కుట్రలో భాగంగానే మైనార్టీలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు

- రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి ఏ ఒక్క సామాజిక వర్గానికి రక్షణ లేకుండా పోయింది.

- ముఖ్యంగా మైనార్టీల పరిస్థితి దయనీయంగా మారింది.

- వారిపై విద్వేష దాడులు, హత్యలు విపరీతంగా పెరిగాయి.

2020-11-23 05:36 GMT

తూర్పు గోదావరి జిల్లా

కాకినాడ

- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..

- కాకినాడ తీరంలో ఈనెల 24 నుంచి 26 వరకు నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సంయుక్త ఆధ్వర్యాన జలప్రహార్‌-2020 పేరుతో జరగనున్న యాంపీబీయస్‌ విన్యాసాల కోసం   అధికారులు ఏర్పాట్లు

- కాకినాడ రూరల్‌ (మం) సూర్యారావుపేట తీరంలో నేవల్‌ ఎన్‌క్లేవ్‌లో జలప్రహార్‌ పేరిట జల, గగన తలాలపై నిర్వహించనున్న విన్యాసాల కోసం లైట్‌హౌస్‌    సముద్రతీరానికి దూరంగా డీప్‌ సీలోకి విశాఖపట్టణం నుంచి చేరుకున్న యుద్ధనౌక.

- విన్యాసాల కోసం బీచ్‌రోడ్డులోని లైట్‌హౌస్‌ నుంచి ఉప్పాడ వైపు వెళ్లే రహదారిలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు-

- కాకినాడ డీఎస్పీ భీమారావు ఆదేశాల మేరకు పోలవరం, నేమాం నుంచి బీచ్‌ రోడ్డువైపు, బీచ్‌రోడ్డు నుంచి ఓల్డ్‌ ఎన్టీఆర్‌ బీచ్‌లోకి వెళ్లే సమాంతర రోడ్లకు అడ్డంగా   నివారణ చర్యలు చేపట్టి బందోబస్తు ఏర్పాటు ..తిమ్మాపురం ఎస్‌ఐ విజయబాబు

2020-11-23 05:33 GMT

  జాతీయం

* దట్టంగా అలుముకున్న పొగమంచు

* ఈరోజు 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

* గరిష్టంగా 25 డిగ్రీల ఉషోగ్రత నమోదుకానున్నట్లు అంచనా వేసిన భారత వాతావరణ శాఖ

* పశ్చిమ హిమాలయాల మీదుగా వచ్చే చల్లటి గాలుల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన చలి ప్రభావం

* నిన్న ఢిల్లీలో అత్యల్పంగా 6.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

* నవంబర్ నెలలో 17 ఏళ్ళలోనే కనిష్ట ఉషోగ్రత నమోదు

2020-11-23 05:31 GMT

 అమరావతి....

-క్యాబ్,ఆటోల్లో ప్రయాణించే మహిళ రక్షణ కు ప్రతిష్టాత్మకంగా అమలు...

-138.48కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐవోటీ ప్రాజెక్టు...

-పైలెట్ ప్రాజెక్టుగా విశాఖ ఎంపిక...వెయ్యి ఆటోల్లో ట్రాకింగ్ డివైజ్ లు ...

-వచ్చే నవంబర్ నాటికి లక్ష వాహనాల్లో ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటు...

2020-11-23 05:28 GMT

 కృష్ణాజిల్లా..

* ఎదురెదురుగా ఢీకొన్న ట్రాక్టర్ , కారు .... కారుడ్రైవర్ కు తీవ్ర గాయాలు

* పోలీసులు కారులో ఇరుక్కున్న వ్యక్తి ని బయటకు తీసేందుకు ప్రయత్నం

* జి.కొండూరు వైపు నుంచి మైలవరం కంకరు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్

* మైలవరం వైపు నుంచి జి.కొండూరు వైపు వెళ్తున్న కారు

* అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొనడంతో రహదారిపై పల్టీ కొట్టిన ట్రాక్టర్

* ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కు స్వల్ప గాయాలు

* ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవరును 30 నిమిషాలు శ్రమించి బయటకు తీసిన పోలీసులు

* విజయవాడ - భద్రాచలం రోడ్డుపై స్తంభించిన ట్రాఫిక్

2020-11-23 05:25 GMT

  నెల్లూరు...

... మళ్లీ ప్రారంభమైన వర్షం

... తెల్లవారుజాము నుంచి పలు మండలాల్లో మోస్తరుగా వర్షాలు

... ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న చెరువులు, జలాశయాలు.

... అప్రమత్తం గా ఉండాలంటూ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు.

Tags:    

Similar News