Live Updates: ఈరోజు (16 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-11-16 01:49 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 16 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | పాడ్యమి ఉ. 9-07 తదుపరి విదియ | అనూరాధ నక్షత్రం సా. 5-41 తదుపరి జ్యేష్ఠ | వర్జ్యం రా.10-59 నుంచి 12-29 వరకు | అమృత ఘడియలు ఉ.7-56 నుంచి 9-26 వరకు | దుర్ముహూర్తం మ.12-07 నుంచి 12.52 వరకు తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు | రాహుకాలం ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-09 | సూర్యాస్తమయం: సా.05-21

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-11-16 14:02 GMT

 టీఎస్ హైకోర్టు.

* దిశ ఎన్ కౌంటర్ చిత్రం యూనిట్ తో పాటు ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు..

* దిశ చిత్రాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టులో రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసిన దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి...

* మహిళ పై జరిగిన అత్యాచారం, హత్య ను కథ గా చేస్తూ అర్జీవి తీస్తున్న సినిమా ను నిలిపి వేయాలని కోర్టును కోరిన పిటీషనర్ తరపు న్యాయవాది అరుణ           కుమారి..

* బాధితులు, నిందితుల కుటుంబ సభ్యులు జుడిషియల్ కమిషన్ కలిసి ఫిర్యాదు చేసారని కోర్టుకు తెలిపిన అరుణ కుమారి..

* యూట్యూబ్ లో పెట్టిన దిశ ట్రైలర్ వెంటనే తీసివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన అరుణ కుమారి..

* ఈ చిత్రం విడుదల కావడం వలన కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతింటున్నాయని కోర్టుకు తెలిపిన పిటీషనర్ అడ్వొకేట్..

* ఒకవైపు జ్యుడీషియల్ కమిషన్ విచారణ చేపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు చిత్రాన్ని ఎలా తీస్తారన్న పిటీషనర్..

* చిత్రాన్ని విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరిన అరుణ కుమారి.

* 7 గురు ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ..

* తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

2020-11-16 13:57 GMT

 జోగులాంబ గద్వాల జిల్లా :

* ఈనెల 20న ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాల సందర్బంగా

* పుష్కర ఘాట్ ల వద్ద భక్తుల భద్రతపై అదికారులత సమీక్ష నిర్వహించి పుష్కర ఘాట్ ను పరిశీలించిన డి.ఐ.జి శివ శంకర్ రెడ్డి....

2020-11-16 13:21 GMT

హైదరాబాద్... 

గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ను కలిసిన భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కే. అరుణ

#గవర్నర్ కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసేందుకే వెళ్లినట్లు వెల్లడి.

#జీ.హెచ్.ఎం.సీ ఎన్నికల్లో కాషాయపు జెండా ఎగురవేస్తాం.

#హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు కనీసం పలకరించేందుకు కూడా సీఎం కేసీఆర్ వెళ్ళలేదు.

#జీ.హెచ్.ఎం.సీ ఎన్నికల్లో లబ్ది చేకూర్చేందుకే రూ.10వేల ఆర్థిక సాయం.

#వరద బాధితుల్లో అర్హులకంటే అనర్హులకే 10వేలు అందించారు.

2020-11-16 13:14 GMT

ఖమ్మం...

- మహిళా కౌలు రైతు ఆత్మహత్యా యత్నం

- ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ముందే పురుగు మందు తాగిన కౌలు రైతు తుమ్మల దివ్య

- గత నెలలో కౌలు భూమిలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఇద్దరు కూలీలు...

- 10 లక్షల పరిహారం ఇవ్వాలని పెద్ద మనుషుల తీర్మానం

- పరిహారం ఇవ్వలేమని ఆత్మహత్య యత్నం చేసిన మహిళా కౌలు రైతు....

2020-11-16 13:13 GMT

 హైదరాబాద్:

- మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

- తుంగభద్ర పుష్కరాల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు

- సమీక్ష లో పాల్గొన్న దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్ తో పాటు ఇత‌ర అధికారులు

- ఈ నెల‌ 20 న నుంచి డిసెంబర్‍ 1 వరకు తుంగభద్ర పుష్కరాలు

- పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2.50 కోట్ల నిధులు మంజూరు

2020-11-16 13:05 GMT

  నిజామాబాద్:

- బస్ ఆటో ఢీకొని 12మందికి గాయాలు...

- మొస్రా మండలం గోవూర్ గ్రామ శివారులో బస్ ఆటో ఢీకొన్న ఘటనలో 12 మందికి గాయాలు ....

- అంబులెన్స్ లో నిజామాబాద్ ఆసుపత్రికి తరలింపు...   

2020-11-16 13:02 GMT

  నిజామాబాద్...

--జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పోలీసుల దాడులు

--161 కేసులు నమోదు

--859 మంది అరెస్ట్

--15 లక్షల 23 వేల నగదు స్వాధీనం

--పోలీస్ కమిషనర్ కార్తికేయ వెల్లడి

2020-11-16 12:42 GMT

నిజామాబాద్:

- లింగం పై ఉన్న కలిశం దానింతట అదే ఉగడంతో మహిమను చూడడానికి బారులు తీరిన భక్తులు

- కార్తీక మాసం సోమవారం కావడంతో ఇది శివుని మహిమనే అని భక్తులు నమ్ముతున్నారు.

- శివలింగం ను దర్శించుకొంటున్న మహిళ భక్తులు

2020-11-16 12:40 GMT

సంగారెడ్డి జిల్లా..

- జహీరాబాద్ మండలంలోని గోవింద్ పూర్ గ్రామ శివారులో 30 ఎకరాల భూ వివాదంలో ఒక వర్గం వారు మరో వర్గం వారిపై తుపాకీతో నాలుగు రౌండ్ల కాల్పులు చేసి     పారిపోయారు

- కాల్పులలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

- ఘటనా స్థలం వద్ద విచారణ చేపడుతున్న పోలీసులు.

2020-11-16 12:36 GMT

నల్గొండ:

-నకరికల్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ,నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల‌ భూపాల్ రెడ్డి సోదరుల మధ్య తారా స్థాయిలో విభేదాలు...

-చిట్యాల లో ఉన్న తమ‌ కాటన్ మిల్లు పై స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వేధింపులు చేస్తున్నారని...‌ఎమ్మెల్యే లింగయ్య వైఖరి తో రేపటి నుంచి మిల్లు లో      పత్తి‌ కోనుగోళ్లు ‌బంద్ అంటూ ప్లేక్సీ...

-మిల్లు లో‌ స్థానిక ఎమ్మెల్యే, అధికారుల వైఖరిని పేర్కోంటూ ఫ్లేక్సీ లను ఏర్పాటు చేసిన నల్గొండ ఎమ్మెల్యే సోదరుడు‌ ,టిఆర్ఎస్ నాయకుడు‌‌ కంచర్ల కృష్ణా రెడ్డి...

Tags:    

Similar News