Weight Gain: ఈ 5 పండ్లు సైలెంట్‌గా మీకు తెలియకుండానే మీ బరువును పెంచేస్తాయి..

Weight gain Fruits: పండ్లు, కూరగాయలు తీసుకుంటే సమతుల ఆహారం.. ఆరోగ్యకరమంది అనుకుంటారు. అయితే కొన్ని రకాల పండ్లు మన బరువును పెంచేస్తాయి.

Update: 2025-03-27 02:00 GMT
Weight Gain

Weight Gain: ఈ 5 పండ్లు సైలెంట్‌గా మీకు తెలియకుండానే మీ బరువును పెంచేస్తాయి..

  • whatsapp icon

Weight gain Fruits: చాలామంది వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు అన్నం, చపాతి తినకుండా పండ్లు, కూరగాయలు తింటారు. వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారని అనుకుంటారు. అయితే కొన్ని రకాల పండ్లు తీసుకోవడం వల్ల సైలెంట్ గా మీకు తెలియకుండానే బరువు పెరిగిపోతారు. కొన్ని నివేదికల ప్రకారం ఇలాంటి పనులు డైట్లో చేరుకున్న పిల్లలు,పెద్దలు బరువు పెరిగి హైట్ కూడా తగ్గారు.

అరటి పండ్లు..

అరటి పండ్లు అతిగా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే సహజసిద్ధమైన చక్కెరలు, కార్బోహైడ్రేట్స్ బరువు పెరగాలే చేస్తాయి. వీటిని వైద్యుల సూచన మేరకు మాత్రమే తీసుకోవాలి. లేకపోతే హఠాత్తుగా బరువు పెరిగిపోతారు. ఒక సాధారణ పరిమాణంలో ఉన్న అరటి పండులో 105 క్యాలరీలు ఉంటాయి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే క్యాలరీలు కూడా ఎక్కువ అవుతాయి.. తద్వారా బరువు కూడా పెరుగుతారు. అంతే కాదు ఇందులో చక్కెర ఉండటం వల్ల రక్తంలో చక్కర స్థాయిలు కూడా హఠాత్తుగా పెరిగిపోతాయి కొవ్వు పెరుగుతుంది..

మామిడి పండ్లు..

మామిడి పండ్లు 'కింగ్ ఆఫ్ ఫ్రూట్' అంటారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అయితే దీన్ని ఎక్కువగా మోతాదులో తీసుకోవడంలో బరువు పెరుగుతారు. ఒక సాధారణ సైజు మామిడి పండులో 200 క్యాలరీలు వరకు ఉంటాయి. ఈ పండు తీసుకోవడం వల్ల తక్షణ శక్తి కూడా అందుతుంది. అయితే చక్కెర మోతాదులు అతిగా ఉంటాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగిపోతాయి.

ఖర్జూరం..

ఖర్జూరంలో కూడా తీపిగా ఉంటాయి. ఇందులో సహజమైన చక్కెరలు కూడా ఉంటాయి. ఇక ఒక ఖర్జూరంలో 70 క్యాలరీలు ఉంటాయి. గుప్పెడు ఖర్జూరాలు తింటే 400 పైగా క్యాలరీలో అవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలో 70% పైగా పెరిగిపోతుంది. దీంతో మన శరీరంలో కొవ్వు కూడా పేరుకుంటుంది. తద్వారా రక్తంలో చక్కర స్థాయిలు పెరిగిపోయి బరువు కూడా పెరిగిపోతారు.

అవకాడో ..

అవకాడో అద్భుతం.. ఈ బట్టర్ ఫ్రూట్‌ ఆరోగ్యకరం. అయితే ఇందులో క్యాలరీలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇది తక్షణ శక్తి అందిస్తుంది. కానీ బరువు కూడా పెంచుతుంది. అవకాడో లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటా.యి కానీ కొవ్వు అధిక మోతాదులో ఉంటుంది. ఈ పండుగ తీసుకుంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా తప్పనిసరి. లేకపోతే ఒబేసిటీ తప్పదు.

ద్రాక్ష పండు..

ఇవి కాకుండా ద్రాక్ష పండులో కూడా నేచురల్ చక్కెరలు అతిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెంచుతాయి. అంతేకాదు కొవ్వు పరిమాణం కూడా పెరిగిపోతుంది. ఎక్కువ మోతాదులో ద్రాక్ష తీసుకుంటే క్యాలరీలు కూడా ఎక్కువ అవుతాయి. ఒక గుప్పెడు ద్రాక్షలో 70 క్యాలరీల వరకు ఉంటాయి.

Tags:    

Similar News