Top 6 News @ 6PM: ఏపీ కేబినెట్ భేటీ ముఖ్యాంశాలు.. పోలీసు వ్యవస్థ పనితీరుపైనా ప్రస్తావన
1) తెలంగాణలో మొదలైన సమగ్ర కుటుంబ సర్వే
తెలంగాణలో నేటి నుండి సమగ్ర కుటుంబ సర్వే మొదలైంది. మొత్తం 75 ప్రశ్నలతో ఉన్న సమగ్ర కుటుంబ సర్వేలో కుటుంబ యాజమాని, సభ్యుల వివరాలు, వారి ఆస్తులు, అప్పులు, వృత్తి, ఆదాయం తదితర వివరాలను సేకరిస్తున్నారు. నేటి నుండి ఈ నెల 30 వరకు సమగ్ర కుటుంబ సర్వే జరగనుంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు కంటోన్మెంట్‌లోనూ ఈ సర్వే నిర్వహించనున్నారు. కంటోన్మెంట్ పరిధిలో 50 వేల ఇళ్లలోను.. జీహెచ్ఎంసీ పరిధిలో 27లక్షల 76వేల 682 గృహాలపై సర్వే చేపట్టనున్నారు. ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా గుర్తించారు. 56 ప్రధాన, 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలతో సమగ్ర సమాచారాన్ని తీసుకుంటున్నారు. పార్ట్-1, పార్ట్-2 కింద ఎనిమిది పేజీల్లో ఈ సమాచారాన్ని పూరిస్తారు. మొదటి భాగం (పార్ట్-1)లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు తెలపాల్సి ఉంటుంది. పార్ట్-1లో మొత్తం 60 ప్రశ్నలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. రెండో భాగంలో ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.
2) ఫామ్ హౌజ్ పార్టీ కేసులో విచారణకు విజయ్ మద్దూరి
సంచలనం సృష్టించిన కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌజ్‌లో పార్టీ కేసులో విచారణ కొనసాగుతోంది. రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి ఇవాళ మోకిల పోలీసుల ఎదుట విచాణకు హాజరయ్యారు. నాలుగు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. గతంలో రాజ్ పాకాల వద్ద వాంగ్మూలం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ వాంగ్మూలం ఆధారంగానే విజయ్ మద్దూరిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఫామ్ హౌజ్‌లో జరిగిన పార్టీలో డ్రగ్స్ వినియోగించారా? వినియోగిస్తే అవి ఎవరు ఇచ్చారు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
3) ఏపీ కేబినెట్ భేటీ ముఖ్యాంశాలు
ఏపీలో కేబినెట్ భేటీ ముగిసింది. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ అమెండ్ మెంట్ బిల్లుకు, కుప్పం అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటైన కుప్పం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రకటించిన పిఠాపురం ఏరియా డెవలప్ మెంట్ అథారిటి ఏర్పాటుకు కూడా కేబినెట్ పచ్చజండా ఊపింది. సీఆర్డిఏ పరిధిని పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
4) పోలీసు వ్యవస్థను గాడిపెడదామన్న చంద్రబాబు
ఏపీలో కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు చంద్రబాబు స్పందిస్తూ..త్వరలోనే పోలీసు వ్యవస్థను గాడిన పెడదామని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
5) నంద్యాల కేసులో అల్లు అర్జున్‌కు ఇక రిలాక్స్
అల్లు అర్జున్ కు ఏపీ హై కోర్టుల్ ఊరట లభించింది. ఎన్నికల సమయంలో నంద్యాలలో అల్లు అర్జున్ స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల ర్యాలీకి అనుమతి లేదని అక్కడి ఎన్నికల అధికారి పోలీసులు
6) అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ ఎన్నిక దాదాపు ఖాయమైపోయింది. ఇక మిగిలిందల్లా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అమెరికా కాంగ్రెస్‌లో మొత్తం 538 సభ్యులు ఉన్నారు. అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలంటే అందులో 270 మంది మద్దతు అవసరం. ఆ మ్యాజిక్ ఫిగర్ ను డోనల్డ్ ట్రంప్ సునాయసంగానే చేరుకున్నారు. ఆరంభం నుండి ఏ దశలోనూ కమలా హారీస్ నుండి గట్టి పోటీ కనిపించలేదు. మొత్తానికి అమెరికాలో డెమొక్రటిక్ పార్టీపై రిపబ్లికన్స్ విజయం సాధించారు. బో బైడెన్ తరువాత అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ మరోసారి బాధ్యతలు తీసుకోనున్నారు. డిసెంబర్‌లో ఎలక్టోరల్ కాలేజ్ ప్రక్రియ జరగాల్సి ఉంది. ఆ తరువాత జనవరిలో ట్రంప్ ప్రమాణస్వీకారం ఉంటుంది.