Russia-Ukraine war: పుతిన్ యుద్ధం ఎందుకు చేస్తున్నారు?
Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది.
Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లోని సైనిక, నావీ, ఎయిర్ ఫోర్స్ స్థావరాలపై రష్యా మెరుపు దాడి చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే వందలాది మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే.. అసలు పుతిన్ యుద్ధం ఎందుకు చేస్తున్నారు..? సాంస్కృతికపరంగా, సామాజికంగా రష్యాతో ఉక్రెయిన్‌కు అనాధిగా సంబంధాలు ఉండేవి. అలాంటిది.. ఇప్పుడు యుద్ధానికి ఎందుకు దారి తీశాయి.
2014 వరకు రష్యా, ఉక్రెయిన్ మధ్య సత్సంబంధాలు ఉండేవి. అయితే.. రష్యా అనుకూల సర్కారు కుప్పకూలడంతో ఉక్రెయిన్ పై పుతిన్ సర్కార్ ఆగ్రహంతో ఉంది. 2014లో ఉక్రెయిన్‌పై దాడి చేయడంతో పరిస్థితులు మారాయి. నాటి యుద్ధంలో 14 వేల మంది చనిపోయారని పాశ్చత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో.. యూరోపియన్ యూనియన్, నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ సిద్ధమైంది. ఇది రష్యాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఉక్రెయిన్‌లో మిలటరీ స్థావరాలు ఉండరాదని, తటస్థ దేశంగా ఉండాలని రష్యా కోరుకుంటోంది. ఉక్రెయిన్ తమ మాటకు విలువివ్వకపోవడంతో గరం గరంగా ఉన్న రష్యా.. యుద్ధానికి దిగింది.