సునీత విలియమ్స్ చిన్నప్పటి లక్ష్యం వేరు... చివరకు అయ్యింది వేరు

Update: 2025-03-19 09:55 GMT
Sunita Williams wanted to become veterinary doctor but later she joined US Navy as a Naval Aviator and know how she became NASA astronaut

సునీత విలియమ్స్ చిన్నప్పటి లక్ష్యం వేరు... చివరకు అయ్యింది వేరు

  • whatsapp icon

Sunita Williams's career journey highligts: విధి ఎవరిని ఎటువైపు తీసుకెళ్తుందో తెలియదు అని అంటుంటారు కదా... భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ విషయంలోనూ ఎగ్జాట్ల్‌లీ అదే జరిగింది. ఆమె చిన్నప్పుడు పెట్టుకున్న లక్ష్యానికి, పెరిగి పెద్దయ్యాక ఆమె ఎంచుకున్న రంగానికి, సాధించిన ఘన విజయాలకు అసలు సంబంధమే లేదు.

ఆమె నాసాలోకి ఎలా అడుగుపెట్టారు? అంతకంటే ముందు ఏం జరిగింది? డెస్టినీ ఆమెను ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్లిందనే వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

సునితా విలియమ్స్‌కు చిన్నప్పటి నుండే సైన్స్ పట్ల ఎంతో ఆసక్తి. పెద్దయ్యాకా వెటెరినరి డాక్టర్ అవ్వాలనేది ఆమె చిన్నప్పటి ఆశయం. ఆమె సోదరుడు జయ్ అమెరికా నేవల్ అకాడెమీలో పనిచేస్తుండే వారు. 1986 వ సంవత్సరం... హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూయిజ్ నటించిన టాప్ గన్ మూవీ రిలీజ్ బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తోన్న రోజులవి. ఆ సినిమాలో టామ్ క్రూయిజ్ నేవల్ ఏవియేటర్ పాత్రలో ఇరగదీశారు.

సునితా విలియమ్స్‌ ఆ సినిమా చూసిన తరువాత ఒకసారి తన సోదరుడు జయ్‌ను కలవడానికని అమెరికా నేవల్ అకాడమికి వెళ్లారు. అక్కడ వారి వర్క్ స్టైల్ చూశాకా ఆమె ఆలోచన మారింది. పశువైద్యురాలిని అవ్వాలన్న ఆలోచనలోంచి నేవల్ ఏవియేటర్ ఫైటర్ అవ్వాలనే ఆలోచన వైపు షిఫ్ట్ అయ్యారు. ఆ తరువాత ఆమె నేవల్ ఏవియేషన్ ట్రైనింగ్ కమాండ్‌లో జాయిన్ అయ్యారు. కానీ అక్కడ ఆమెకు ఎయిర్‌క్రాఫ్ట్ నడిపే అవకాశం రాలేదు.

1989 లో అమెరికా నేవీలో నేవల్ ఏవియేటర్ గా చేరారు. వర్జీనియాలోని నార్ఫోక్‌లో ఉన్న హెలీక్యాప్టర్ కంబాట్ సపోర్ట్ స్క్వాడ్రాన్ 8 లో ఆమె నేవల్ ఏవియేటర్‌గా అపాయింట్ అయ్యారు. అనేక ప్రాంతాల్లో క్లిష్టమైన పరిస్థితుల్లోనూ విజయవంతంగా విధులు నిర్వహించి అందరికీ తోటి సిబ్బందికి లీడర్‌గా ఎదిగారు. హెలీక్యాప్టర్ల ద్వారా సైన్యం తరలింపులో, ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు మానవ సహాయం అందించడంలో కీలక పాత్ర పోషించారు. అక్కడ పదేళ్లపాటు పనిచేసిన తరువాత ఆమె ఫోకస్ నాసాపై మళ్లింది.

నాసాలో ఎప్పుడు చేరారంటే...

1998 లో అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసాలో ఆమె వ్యోమగామిగా చేరారు. 2006 లో ఆమె తన తొలి మిషన్‌లో పాల్గొన్నారు. అంతరిక్షంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో 195 రోజుల పాటు డ్యూటీ చేసేందుకు వెళ్లడం కోసం ఆమె తొలిసారిగా డిస్కవరీ స్పేస్ షటిల్ ఎక్కారు. 2007 లో అదే స్పేస్ స్టేషన్‌లో థ్రెడ్‌మిల్‌పై 4 గంటల 24 నిమిషాల పాటు మారథాన్ చేసి అంతరిక్షంలో మారథాన్ చేసిన తొలి వ్యోమగామిగా రికార్డ్ సృష్టించారు.

2012 లో సునితా విలియమ్స్‌కు మరోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే అవకాశం వచ్చింది. ఈసారి 4 నెలలపాటు ఆమె స్పేస్ స్టేషన్‌లో పనిచేసే సిబ్బందికి ఆమె నాయకురాలిగా వ్యవహరించి ఆ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారు.

ఇక తాజాగా గతేడాది జూన్ లో ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లాల్సి రావడం ఆమె కెరీర్లో ఇది మూడోసారి. ఈసారి ఏకంగా 9 నెలల పాటు ఆమె అక్కడే చిక్కుకుపోయారు. బుధవారమే ఆమెను తీసుకొచ్చిన స్పేస్ఎక్స్ క్యాప్సూల్ అట్లాంటిక్ సముద్రంలో దిగడం, ఆ తరువాత నాసా, స్పేస్ఎక్స్ బృందాలు సముద్రంలోకి షిప్ ద్వారా ఎదురెళ్లి ఘన స్వాగతం పలకడం వరకు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. 

Tags:    

Similar News