భూమి మీదకు సునీతా: వ్యోమనౌకను హీట్ షీల్డ్ ఎలా కాపాడుతాయి, వేగం ఎలా నియంత్రిస్తారు?

సునీత విలియమ్స్, బుచ్ విల్ మోర్ తొమ్మిది నెలల తర్వాత అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చారు.

Update: 2025-03-19 11:22 GMT
భూమి మీదకు సునీతా: వ్యోమనౌకను హీట్ షీల్డ్ ఎలా కాపాడుతాయి, వేగం ఎలా నియంత్రిస్తారు?

భూమి మీదకు సునీతా: వ్యోమనౌకను హీట్ షీల్డ్ ఎలా కాపాడుతాయి, వేగం ఎలా నియంత్రిస్తాయి?

  • whatsapp icon

సునీత విలియమ్స్, బుచ్ విల్ మోర్ తొమ్మిది నెలల తర్వాత అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చారు. సురక్షితంగా స్పేస్ క్రాఫ్ట్ భూమి మీదకు దిగడానికి నాసా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అత్యంత వేగంతో పాటు ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకునేలా వ్యోమనౌకకు పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉంటుంది.

అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకొనేలా వ్యోమనౌక డిజైన్

వ్యోమ నౌకలు అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చే సమయంలో 24 వేల మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ వ్యోమనౌక అంత వేగంతో ప్రయాణించే సమయంలో ఆ వేగాన్ని తగ్గిస్తారు. ఇందుకు తగ్గట్టు వ్యోమనౌకలో రెండు డ్రోగ్ చూట్లు ఉంటాయి. ఈ డ్రోగ్ చూట్లు వ్యోమనౌక వేగాన్ని నియంత్రిస్తాయి. వ్యోమనౌక భూ వాతావరణంలో ప్రవేశించే సమయంలో విపరీతమైన వేడి పుడుతుంది. 7 వేల డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత ఉద్భవిస్తుంది. ఈ ఉష్ణోగ్రతను తట్టుకునేందుకు వ్యోమనౌక చుట్టూ ఉష్ణకవచం ఏర్పాటు చేస్తారు. వ్యోమనౌక భూమి మీదకు వచ్చే సమయంలో భూ వాతావరణం కారణంగా మండుతున్న అగ్ని గోళంగా కన్పిస్తుంది. ఆమెస్ వివిధ రకాల హీట్ షీల్డ్ మెటీరియల్స్ డిజైన్లను కనిపెట్టింది. దీనిని అపోలో ప్రోగ్రామ్ కోసం అభివృద్ది చేసి ఓరియన్ క్రూ కాప్సూల్ హీట్ షీల్డ్ కోసం ఉపయోగిస్తున్నారు. పినోలిక్ ఇంప్రెగ్రేటెడ్ కార్బన్ అబ్లేటర్ లేదా పీకా ఉన్నాయి.మొదట 1990లలో అభివృద్ది చేసిన పెకాను ఇంకా ఉపయోగిస్తున్నారు.

వ్యోమనౌకలో హీట్ షీల్డ్ ప్రాముఖ్యత

స్పేస్‌క్రాఫ్ట్‌ను రక్షించడంలో హీట్ షీల్డ్ మొదటి రక్షణ రేఖ. హీట్ షీల్డ్ ఖచ్చితంగా ఏ ఆకారంలో ఉండాలి? ఎంత మందంగా ఉండాలి? అది ఎంత అంతరిక్ష నౌకను కవర్ చేయాలి? సంవత్సరాలుగా, దాదాపు ఏ గమ్యస్థానం నుండి అయినా మిషన్‌లను ఇంటికి తీసుకురావడానికి అమెస్ వివిధ రకాల థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్‌లను అభివృద్ధి చేసింది.అమెస్ రూపొందించిన హీట్ షీల్డ్‌లను అపోలో మిషన్‌లు, మార్స్ సైన్స్ లాబొరేటరీ, మార్స్ 2020 మిషన్ సహా వివిధ మిషన్‌లకు ఉపయోగించారు. నమూనా రిటర్న్ మిషన్‌ల కోసం, అంతరిక్షం నుండి విలువైన పదార్థాల నమూనాలను రక్షించడానికి హీట్ షీల్డ్‌లు మరింత ముఖ్యమైనవి.

వ్యోమ నౌక వేగాన్ని ఎలా నియంత్రిస్తారు?

భూ వాతావరణంలోకి వ్యోమనౌక వచ్చే సమయంలో దాని వేగాన్ని క్రమంగా తగ్గిస్తారు. గాలిలో ప్రయాణించే ఏ వస్తువునైనా దాని వేగాన్ని గాలి కంట్రోల్ చేస్తుంది. స్పేస్ క్రాఫ్ట్ భూమి నుంచి 10 కి.మీ నుంచి 50 కి.మీ. ఎత్తులో ప్రయాణించే సమయంలో దాని స్పీడ్ భారీగా తగ్గుతుంది. వ్యోమనౌక వేగం 39 వేల కి.మీ. నుంచి 800 కి.మీ.వేగానికి నిమిషాల వ్యవధిలోనే తగ్గుతుంది. వ్యోమనౌకలో డ్రోగ్ చూట్లు దోహదపడుతాయి.

Tags:    

Similar News