Putins Gift: అమెరికా అధ్యక్షుడికి పుతిన్ భారీ కానుక..ఏం ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు

Putins Gift: రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్ నకు ఓ కానుక బహూకరించారట. ఈ విషయాన్ని క్రెమ్లిన్ స్వయంగా ధ్రువీకరించింది. ఇటీవల ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ వెట్ కాఫ్ మాస్కోలో పర్యటించారు. ఆ సమయంలో విట్ కాఫ్ కు ట్రంప్ చిత్రాన్ని ఇచ్చి దాన్ని ట్రంప్ నకు అందించాలని కోరినట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వివరించారు. విట్ కాఫ్ గతవారం ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని పేర్కొంటూ ఆ బహుమతిని అందమైందిగా అభివర్ణించారు. 2018లో ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చాక పుతిన్ ఓ సాకర్ బంతిని ట్రంప్ నకు బహుమతిగా ఇచ్చారు.
గత ఏడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. పెన్సిల్వేనియాలో ప్రచారంలో ఉండగా 20ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్ చెవికి స్వల్ప గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ చుట్టూ రక్షణగా చేరి వేదికపై నుంచి దించి ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పుతిన్ ట్రంప్ క్షేమం కోసం అప్పుడు ప్రార్థనలు కూడా చేశారని ఇటీవల విట్కాఫ్ పేర్కొన్నారు. స్థానిక చర్చికి వెళ్లి మత గురువును కలిసి అధ్యక్షుడి కోసం ప్రార్థించినట్లు చెప్పారు.
ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులోభాగంగానే 30 రోజుల కాల్పుల విమరణను ప్రతిపాదించారు. దీనికి ఉక్రెయిన్ అంగీకరించింది. మాస్కో సూత్రప్రాయంగా ఓకే చెప్పింది. ఈ క్రమంలోనే ఇరుదేశాల అధ్యక్షులతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై నెలరోజలుపాటు దాడులు నిలిపివేయాలని పుతిన్ కు సూచించారు. దీనికి ఆయన అంగీకరించారు. కొద్ది గంటలకే అది ఉల్లంఘనకు గురైంది.