బికినీలో మోడల్ ఫోటో.. పోప్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి లైక్!
ఒక్కోసారి కొన్ని పనులు పెద్ద ఇరకాటంలోకి నెట్టేస్తాయి. సామాన్య జనానికి అటువంటి ఇరకాటం ఎదురైనా.. కొద్దిగా సర్దుకోవడానికి అవకాశం ఉంటుంది. పెద్దగా నష్టం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవచ్చు.
ఒక్కోసారి కొన్ని పనులు పెద్ద ఇరకాటంలోకి నెట్టేస్తాయి. సామాన్య జనానికి అటువంటి ఇరకాటం ఎదురైనా.. కొద్దిగా సర్దుకోవడానికి అవకాశం ఉంటుంది. పెద్దగా నష్టం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవచ్చు. అయితే, పెద్దస్థాయిలో ఉన్న వ్యక్తుల విషయంలో పొరపాటు దొర్లిందా ఇక అంతే. అందులోనూ మత గురువులు..సన్యాసులు.. పీఠాధిపతులు అన్నిటికీ అతీతంగా ఉండాలి. ఐహిక బంధాలకు దూరంగా ఉండాలి. వారు చేసే ప్రతి చర్యకూ ప్రజలు ఆకర్షితులు అవుతారు. వారి ప్రతి పనీ ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది. మతమేదైనా కానీయండి.. ఆధ్యాత్మిక బాటలోఉన్నవారు కొన్ని విషయాల్లో చేసే తప్పులను సమాజం ఒప్పుకోదు. సరిగ్గా ఇటువంటి చిక్కులోనే పడ్డారు పోప్ ఫ్రాన్సిస్.
ఎలా జరిగిందో కానీ, ఓ బిగినీ భామ ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్ లోపాప్ ఫ్రాన్సిస్ అధికారిక ఖాతా నుంచి 'లైక్' వెళ్ళింది. ఇప్పుడు ఇది కాస్తా పాప్ ఫ్రాన్సిస్ కు పెద్ద తలనొప్పి తీసుకువచ్చింది.
ఏం జరిగిందంటే..
మోడల్ నటాలియో గారిబోట్టో గత నెల ఐదో తారీఖున బికినీ ధరించి ఓ స్కూల్ లాకర్ వద్ద నిలబడి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఎంతలా అంటే.. 1.5 మిలియన్లకి పైగా లైక్స్ దీనికి వచ్చాయి. అయితే, ఈ లైక్స్ లో పాప్ ఫ్రాన్సిస్ అధికారిక ఖాతా నుంచి కూడా ఈనెల 13న లైక్ వచ్చింది. ఇప్పుడు ఇది పెద్ద సంచలనంగా మారిపోయింది. ఈ లైక్ స్క్రీన్ షాట్ ను నటాలియా మానేజ్‌మెంట్ కంపెనీ సీఓవై.కో తన పబ్లిసిటీకి వాడుకోవాలని భావించింది. పోప్ ఫ్రాన్సిస్ లైక్ చేసిన స్క్రీన్ షాట్‌ని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. 'సీఓవై.కోకి పోప్ నుంచి ఆశీర్వాదాలు లభించాయి. మా ఐకానికిక్ క్వీన్ నటాలియాకు ధన్యవాదాలు' అంటూ స్క్రీన్ షాట్‌ని షేర్ చేసింది. దాంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది.
ఈ ట్రోలింగ్ తో హోలీ సీ ఈ వార్తల్ని ఖండించింది. సిబ్బంది ఎవరో మోడల్ ఫోటోని లైక్ చేసి ఉండవచ్చు. దీని గురించి విచారణ చేస్తున్నాం అని తెలిపారు. వాటికన్ ప్రతినిధి గార్డియన్‌తో మాట్లాడుతూ, "హోలీ సీ నుంచి" లైక్ "వచ్చిందని భావిస్తున్నాం. వివరణ ఇవ్వాల్సిందిగా ఇన్‌స్టాగ్రామ్‌ని కోరాం" అని తెలిపారు. అయినప్పటికీ పోప్ ఫ్రాన్సిస్ పై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
పోప్ ఫ్రాన్సిస్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫ్రాన్సిస్కస్‌కు 7.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీనిలో 971 పోస్టులు ఉన్నాయి. వేరే అకౌంట్‌లని ఈయన ఫాలో కారు..