అమెరికా చదువుల కోసం రూ. 40 లక్షలు అప్పు చేసి ఉత్తి చేతులతో తిరిగొచ్చాను... నా పరిస్థితి ఏంటి?

Indian student drowning in debts with Education loan: రూ. 40 లక్షలు అప్పు చేసి అమెరికా వెళ్లి ఉత్తి చేతులతో తిరిగొచ్చా.

Update: 2025-03-31 10:51 GMT

అమెరికా చదువుల కోసం రూ. 40 లక్షలు అప్పు చేసి ఉత్తి చేతులతో తిరిగొచ్చాను... నా పరిస్థితి ఏంటి?

Indian student drowning in debts: "అమెరికాలో చదువుకోవాలి, మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనే కలను నిజం చేసుకునేందుకు రూ. 40 లక్షలు అప్పు చేశాను. మా నాన్నది చిన్న వ్యాపారం. అయినా సరే నా కలలను తన కలలుగా భావించి రూ. 40 లక్షల ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు. చదువు పూర్తయింది కానీ అమెరికాలో ఉద్యోగం రాలేదు. ఏడాదిపాటు అదే పనిగా ట్రై చేశాను. నా ఖర్చుల కోసం నెల నెల అమ్మానాన్నలే డబ్బులు పంపించే వారు. కానీ వ్యాపారంలో నష్టాలు, నాన్న ఆరోగ్యం దెబ్బతినడం వంటి పరిణామాలు ఇంకా ఇబ్బందిపెట్టాయి" అంటూ అమెరికా నుండి ఇండియాకు తిరిగొచ్చిన ఒక వ్యక్తి తను పడుతున్న ఆర్థిక ఇబ్బందులను రెడిట్ ద్వారా నెటిజెన్స్‌తో పంచుకున్నారు. 

ఆ వ్యక్తి రాసిన రెడిట్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన చెప్పే ఇబ్బందులు వింటే ఎవరికైనా అయ్యో అని అనిపించకమానదు. ఆ రెడిట్ పోస్టులో ఆయన ఇంకా ఏమేం రాశారంటే...

అమెరికాలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగానే నాన్నకు వ్యాపారంలో నష్టం వచ్చింది. ఆరోగ్యం దెబ్బతింది. వారు ఇక తనకు డబ్బులు పంపించలేకపోయారు. మరోవైపు అమెరికాలో వీసా రూల్స్ కఠినతరం చేయడం, అమెరికాలో జాబ్ మార్కెట్ సరిగ్గా లేకపోవడం ఇబ్బంది పెట్టాయి. అలాంటి పరిస్థితుల్లో ఉత్తి చేతులతో ఇండియాకు తిరిగొచ్చాను.

ప్రస్తుతం నెలకు రూ. 75000 జీతంతో ఒక ఉద్యోగం చేస్తున్నాను. కానీ నా అప్పులకు ఈఎంఐల కోసమే రూ. 66,000 పోతుంది. మిగిలిన రూ.9,000 లలోనే మిగతా అన్ని ఖర్చులు మేనేజ్ చేసుకోవాలి. ఇతర ఆదాయా మార్గాల కోసం ఫ్రీలాన్స్ జాబ్స్ కూడా ట్రై చేస్తున్నాను.

"నా పరిస్థితి చూస్తోంటే నా జీవితం అంతా ఆ ఆర్థిక ఇబ్బందులను సెట్ చేసుకునేందుకే గడిచిపోయేలా ఉంది. అందుకే నన్ను ఈ ఇబ్బందుల్లోంచి బయటపడేసే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి" అంటూ ఆ వ్యక్తి తన ఆవేదనను నెటిజెన్స్‌తో పంచుకున్నారు.

మేనేజ్మెంట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్‌లో ఎంఎస్సీ చేశాను. ఐటీలో డిగ్రీ చేశాను. టెక్ ప్రోడక్ట్స్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఏఐ కన్సల్టింగ్, మార్కెటింగ్, సేల్స్ ఉద్యోగాల్లో అనుభవం ఉంది. అలాంటి ఉద్యోగాల్లో ఏవైనా అవకాశాలు ఉంటే చెప్పండి. కనీసం మాట సాయం చేసే వాళ్లున్నా చెప్పండి అంటూ ఆ రెడిట్ యూజర్ తన ఆవేదనను అంతా వెల్లడించారు.


ఆ వ్యక్తి రాసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనకు తోటి నెటిజెన్స్ ఎవరికి తోచిన విధంగా వారు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

ఇప్పటికే రూ. 75,000 ఉద్యోగం చేస్తున్నారు కనుక ఒక ఏడాదిన్నరపాటు ఆ ఉద్యోగం చేసిన తరువాత మరొక జాబ్‌లోకి స్విచ్ అవండి. అప్పుడు మీకు మరింత ఎక్కువ శాలరీ వస్తుంది అని కొంతమంది సూచించారు. తరచుగా ఉద్యోగాలు మారుతూ ఉంటే జీతం పెరుగుతుంది. ప్రమోషన్స్ వస్తాయి అని ఇంకొంతమంది సలహా ఇచ్చారు.

ఇల్లు అమ్మేసి అప్పులు కట్టి మిగిలిన మొత్తంతో లైఫ్ కొత్తగా ప్లాన్ చేసుకోండి అని కొంతమంది నెటిజెన్స్ సలహా ఇచ్చారు. లేదంటే జీవితాంతం ఇలా మీరు చేసే ఉద్యోగాలు మీ అప్పులకే సరిపోవు అని ఇంకొంతమంది అన్నారు. 

అలాంటి సలహాలు విని ఇల్లు అమ్మొద్దు అని చెప్పిన వారు కూడా లేకపోలేదు. ఇల్లు అమ్మేస్తే, వయసైపోయిన తల్లిదండ్రులతో తరచుగా ఇల్లు మారాల్సి వస్తుంది. ఇంటి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. వాటికంటే ఇంటిని అలానే కాపాడుకోవడం బెటర్ అనేది వారి మాట.  

More interesting news stories: మరిన్ని ఆసక్తికరమైన వార్తా కథనాలు

కెనడా వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను... మీరు ఆ తప్పు చేయకండి పెద్ద చర్చకు దారితీసిన సోషల్ మీడియా పోస్ట్

Donald Trump's high tariffs: ట్రంప్ టారిఫ్‌లతో ఇండియా బేజారు

విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవొచ్చా? తెరిస్తే ఏమవుతుంది?

Tags:    

Similar News