
Earthquake: పపువాన్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.9గా నమోదు అయ్యింది. పశ్చిమ న్యూ బ్రిటన్ ప్రావిన్సులోని కింబే పట్టణానికి 194కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. 10కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. దీంత అమెరికా సునామీ హెచ్చరికలను జారీ చేసింది.
ఈమధ్యే మయన్మార్, థాయ్ లాండ్ లో 7.7తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల ఒక్క మయన్మార్ లోనే మూడు వేల మందికిపైగా మరణంచారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. పలుదేశాల రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.