Trump: ప్రపంచాన్ని తగలబెడుతున్న ట్రంప్.. మూడో ప్రపంచ యుద్ధం?
Donald Trump: ట్రంప్ తీసుకున్న అణు పరీక్షల నిర్ణయం ప్రపంచాన్ని మళ్లీ అణు ముప్పు వైపు నడిపిస్తోంది. దేశాలన్నీ ఆయుధాలే కీలమని భావించగా, శాంతి మాటే మరిచిపోతున్నారు.

Trump: ప్రపంచాన్ని తగలబెడుతున్న ట్రంప్.. మూడో ప్రపంచ యుద్ధం?
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ నిర్ణయం కాక రేపుతోంది. అణు నియంత్రణకు ప్రపంచం నమ్మిన ఒప్పందాల్ని ఆయన లెక్కచేయడంలేదు. అణు పరీక్షలు మళ్లీ ప్రారంభించాలంటూ ఇచ్చిన ఆదేశాలు ప్రపంచాన్ని మళ్లీ అణు యుగంలోకి తీసుకెళ్లాయి.
1968లో ఏర్పడిన NPT ఒప్పందం అణు ఆయుధాల పెరుగుదల్ని అడ్డుకునే గొప్ప ప్రయత్నం. చాలా దేశాలు దీని ప్రేరణతో అణు మార్గం వదిలేసాయి. కానీ ట్రంప్ నిర్ణయం ఆ చరిత్రను తిరగరాసే ప్రయత్నం. ఆయుధాల సంఖ్య తగ్గించాల్సిన అవసరం ఉన్న ఈ సమయంలో, అణు పరీక్షలు మళ్లీ ప్రారంభించడం ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే అణు ఆయుధాలున్న దేశాలు తమ శక్తిని పెంచే పనిలో ఉన్నాయి. రష్యా, చైనా, ఉత్తర కొరియా గట్టిగానే ఎదురుదాడికి సిద్ధమవుతుండగా, ఇండియా–పాకిస్తాన్ వంటి దేశాల మధ్య ఉద్రిక్తతలు అణు ఆయుధాల వినియోగానికి ముప్పుగా మారే అవకాశం కనిపిస్తోంది. యూరప్‌లోనూ భద్రతపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రాన్స్, యూకే లాంటి దేశాలైనా యూరప్ మొత్తాన్ని రక్షించగలవా అనే ప్రశ్నలే.
దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాల ప్రజల్లో అణు ఆయుధాలపైనే నమ్మకం పెరుగుతోంది. ఇలా చూస్తే ట్రంప్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రపంచాన్ని మళ్లీ యుద్ధపు అంచునకి తీసుకెళ్లింది. ప్రపంచ దేశాలు శాంతిని కాదు, ఆయుధాలను ఇష్టపడే దిశగా మారిపోయాయి. శాంతి మాట వినిపించదు.. వేరే మాట వుండదు. ఈ భయంకర మార్గాన్ని మార్చాలంటే, అణు ఆయుధాల పట్ల ప్రపంచం తిరిగి నిబద్ధతతో ఆలోచించాలి. ఈ అణు ఆటకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఇప్పుడు మనందరిపై ఉంది.